సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మే 2024 (15:24 IST)

బిజీగా వున్నా పర్లేదు.. ఇంట హ్యాపీగా ఆవకాయ్ పచ్చడి చేశాను..

Ramyakrishna
Ramyakrishna
ప్రముఖ నటి రమ్యకృష్ణ 50 ఏళ్ల వయస్సులోనూ ఫిజిక్ బాగా మెయింటెన్ చేస్తూ అవకాశాలతో బిజీగా వుంది. ప్రధాన చిత్రాలలో అనేక కీలక పాత్రలను అందుకుంటుంది. సినిమాలతో ఎంత బిజీగా వున్నా.. ఆమె ఫ్యామిలీతో బాగానే టైమ్ స్పెండ్ చేస్తుంది. 
 
ఈ క్రమంలో ఇంట్లో వంటలు చేస్తూ ఆనందిస్తుంది. తాజాగా వేసవిలో ఆవకాయ పచ్చడి సిద్ధం చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 
 
ఆవకాయ, కారం, నూనెను ఆమె చక్కగా కోసిన పచ్చి మామిడికాయలను ఊరగాయ కోసం కలుపుతున్నట్లు ఆ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోకు లైకులు వెల్లువెత్తుతున్నాయి. కాగా రమ్యకృష్ణ ఇటీవల "గుంటూరు కారం" చిత్రంలో మహేష్ బాబు తల్లిగా కనిపించింది.