సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Modified: మంగళవారం, 16 మార్చి 2021 (23:26 IST)

హృద‌య‌మే.. అంటూ క‌దిలించిన రానా!

Aranya, rana
రానా దగ్గుబాటి న‌టించిన చిత్రం ''అరణ్య`. మంగ‌ళ‌వారంనాడు చిత్ర యూనిట్ గీతాన్ని విడుద‌ల చేసింది. హృద‌యాన్ని క‌దిలించేలా ఆ పాట వుంది. ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచిన మేకర్స్.. ఇటీవలే ట్రైలర్ 'వెళ్ళు వెళ్ళు' అనే సాంగ్ రిలీజ్ చేయగా మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని 'హృదయమే' అనే గీతాన్ని విడుదల చేశారు.
'హృదయమే జ్వలించేనే.. ప్రాణమే విడిచి పోయేనే..' అంటూ సాగే ఈ సోల్ ఫుల్ సాంగ్ కి శాంతను మోయిత్ర స్వరాలు సమకూర్చారు. 'నీలిమబ్బుని అడుగు నిజం తెలుపుతుంది.. పూలతీగనడుగు తావి తెలుపుతుంది.. చిన్ని మొగ్గనడుగు చిగురు తెలుపుతుంది' అంటూ అడవులు   ప్రకృతికి సంబంధించిన పదాలు వచ్చేలా లిరిసిస్ట్ వనమాలి సాహిత్యం అందించారు. ఈ గీతాన్ని హరి చరణ్ శేషాద్రి ఆలపించారు. హృదయం ద్రవింపచేసేలా ఉన్న ఈ 'హృదయమే' పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.
 
ఇప్ప‌టికే ఈ సినిమాపై బ‌హు అంచ‌నాలున్నాయి. ఇందులో రానా ఏనుగుల‌తో మాట్లాడే బాష కూడా కొత్త‌గా అనిపిస్తుంది. మ‌రి ఇంత‌కాలం క‌ష్ట‌ప‌డి అడ‌విలో చేసిన ఈ సినిమా రేపు 26న ఏమేర‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోందోన‌ని చిత్ర యూనిట్‌కూ ఆస‌క్తికంగా మారింది. ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషలలో రూపొందిన 'అరణ్య' చిత్రంలో తమిళ నటుడు విష్ణు విశాల్ - జోయా హుస్సేన్ - శ్రియ పిల్గావోంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.