సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జులై 2024 (15:31 IST)

బాలీవుడ్‌ రామాయణం- ముంబై ఫిల్మ్ సిటీలో 12 భారీ సెట్లు

Ranbir Kapoor, Sai Pallavi
బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం కథ సినిమాగా రూపొందుతోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. రామాయణం సీరియల్‌లో రాముడి పాత్ర పోషించిన అరుణ్ కోవిల్ ఇందులో దశరథుడిగా కనిపించనున్నాడు. 
 
రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, సన్నీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ సినిమా కోసం ముంబై ఫిల్మ్ సిటీలో 12 భారీ సెట్లు నిర్మిస్తున్నారు. ఇందులో అయోధ్య, మిథిలా నగర్ మందిరాలు కూడా ఉన్నాయి. 
 
త్రీడీ డిజైన్ ప్రకారం ఏర్పాటు చేయనున్న ఈ హాలు పనులు వచ్చేనెల 15 నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 2025 నాటికి పూర్తి కానుంది.