సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (17:25 IST)

నాగ శౌర్య కల కంటూ ఉంటే ఏమైంది అనేదే రంగబలి

Naga Shaurya, Yukti Tareja
Naga Shaurya, Yukti Tareja
హీరో నాగశౌర్య అవుట్-అండ్-అవుట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు భారీ స్పందన వచ్చింది.
 
మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజుమేకర్స్ లవ్ స్టోరీ ఫేమ్ పవన్ సిహెచ్ స్కోర్ చేసిన సెకండ్ సింగిల్ 'కల కంటూ ఉంటే' పాటని విడుదల చేసారు. మొదటి పాట మాస్ నంబర్ అయితే, రెండవది మంత్రముగ్ధులను మెలోడీ. శౌర్య, యుక్తి మధ్య ఉన్న అందమైన బంధాన్ని ఈ పాట చూపిస్తుంది.  
 
సార్థక్ కళ్యాణి, వైష్  వోకల్స్ అద్భుతంగా ఉన్నాయి. కృష్ణకాంత్ సాహిత్యం ఆకట్టుకుంటుంది. నాగ శౌర్య, యుక్తి కెమిస్ట్రీ అందంగా వుంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
 
దివాకర్ మణి కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌ కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ ప్రకాష్‌. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
నటీనటులు: నాగ శౌర్య, యుక్తి తరేజ, సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో తదితరులు.