ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (16:25 IST)

ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) సెకండ్ పోస్టర్ రిలీజ్ చేసిన రన్వీర్ సింగ్

The Goat Life2n poster
The Goat Life2n poster
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న కొత్త సినిమా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏప్రిల్ 10న "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. 
 
ఇవాళ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా నుంచి సెకండ్ పోస్టర్ ను బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. 'ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా..' అంటూ ఆయన పోస్టర్ రిలీజ్ సందర్భంగా క్యాప్షన్ రాశారు. ఈ సెకండ్ లుక్ పోస్టర్ ఎమోషనల్ గా ఉంది. ఒక ఆశతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న కథానాయకుడి భావోద్వేగం అంతా ఆయన మొహంలో కనిపిస్తోంది. నజీర్ క్యారెక్టర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంతగా ఒదిగిపోయారో ఈ పోస్టర్ చూపిస్తోంది. 
 
90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు.  ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం.