1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జులై 2022 (20:33 IST)

రెచ్చిపోయిన పొట్టి నరేష్.. వార్నింగ్ ఇచ్చిన రష్మీ.. ఎందుకు?

rashmi - sudheer
శ్రీదేవీ డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్‌లో పొట్టి నరేష్ రెచ్చిపోయాడు. అందరి ముందే యాంకర్ రష్మీ గౌతమ్‌ను ఆంటీ అంటూ పిలిచేశాడు. మొదటి సారి పిలిచినప్పుడు ఏయ్ అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా నరేష్ మారలేదు. 
 
మళ్లీ వెంటనే ఆంటీ అని పిలిచాడు. దీంతో దరిద్రుడా రారా నీకు ఉంటది అని అనేసింది రష్మీ. అయితే రష్మీ మాత్రం ఈ శ్రీదేవీ డ్రామా కంపెనీని ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. 
 
ఇకపోతే యాంకర్ రష్మీ వయసు మీద చర్చలు జరుగుతూనే ఉంటాయి. యాంకర్ రష్మీ ఏజ్ మీద సుధీర్ టీం ఎన్నో పంచులు వేసింది. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇంకా మనం నిక్కర్లు వేసుకునే ఉన్నామంటూ ఇది వరకు ఎన్నో పంచులు వేసింది సుధీర్ టీం.
 
ఇక అప్పుడెప్పుడో వచ్చిన హోలీ సినిమాలో కనిపించింది అంటూ ఆటో రాం ప్రసాద్, ఆది వంటి వారు ఇది వరకే సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.