గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (20:03 IST)

పని లేదని చెప్పి వదిలించుకోకుండా జీతాలిస్తున్నాం: రష్మిక (video)

కరోనా కష్టకాలంలో పని లేదని చెప్పి మన వద్ద పని చేసే వారిని వదిలించుకోవడం ఇష్టంలేదనీ, అందుకే మా పని మనుషులకు ప్రతి నెలా వేతనాలు చెల్లిస్తున్నట్టు హీరోయన్ రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది. 
 
ఈ యేడాది సూపర్ డూపర్ హిట్లతో తన కెరీర్‌ను ప్రారంభించిన హీరోయిన్ ఎవరయ్యా అని అంటే ఠక్కున చెప్పే పేరు రష్మిక. ఈ కన్నడ బ్యూటీకి ఈ యేడాది ఆరంభంలోనే అదిరిపోయే హిట్స్ తన ఖాతాలోపడ్డాయి. అందులో ఒకటి ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం. మరో చిత్రం హీరో నితిన్ నటించిన భీష్మ. 
 
అయితే, ఆమె దూకుడుకు కరోనా బ్రేక్ వేసింది. అయితే అనుకోకుండా వచ్చిన కరోనాతో జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడూ బిజీగా ఉండే తను లాక్‌డౌన్ వల్ల ఖాళీగా సమయం గడపలేక పోతున్నారు. 
 
ఈ పరిస్థితులపై రష్మిక స్పందిస్తూ, లాక్డౌన్ విధించినప్పటి నుంచి తనకు, తన తండ్రికి ఆదాయం లేకపోయినా తమ దగ్గర పనిచేస్తున్న వారికి జీతాలిస్తున్నామని తెలిపింది. తనకు పనిలేకపోయినప్పటికీ, తన స్టాఫ్‌కు ఠంచనుగా జీతాలిచ్చేస్తున్నానని తెలిపింది. 
 
'ఈ ఏడాది నాకు బ్రహ్మండంగా ఆరంభమైంది. రెండు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే అనుకోకుండా కరోనా వచ్చిపడింది. జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆదాయం లేదు. మా నాన్న బిజినెస్ కూడా పూర్తిగా నిలిచిపోయింది. 
 
అయినా మా దగ్గర పనిచేస్తున్న 20 మందికి ప్రతి నెలా జీతాలిచ్చేస్తున్నాం. పని లేదని చెప్పి వారిని వదిలించుకోవడం ఇష్టం లేదు. ప్రస్తుతం కొత్త స్క్రిప్టులు వింటున్నట్టు' చెప్పుకొచ్చింది.