గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (21:42 IST)

ర‌ష్మిక మందన ప‌చ్చ బొట్టుకు అర్థం విజ‌య్ దేవ‌ర‌కొండ? (video)

Rshmika Mandanna
న‌టి ర‌ష్మిక మందనా తాజాగా `పుష్ప‌` సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా ఇటీవ‌లే క‌రోనా సెకండ్‌వేవ్ వ‌ల్ల బ్రేక్ ఇచ్చారు. పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో భాగంగా ఆమె హైద‌రాబాద్‌లోనే వుంది. ఈ సినిమా షూటింగ్ వ‌ల్ల హ్యాపీగా వున్నా, కోవిడ్ వ‌ల్ల త‌న త‌ల్లిదండ్రుల‌కు చాలా కాలం దూరంగా వున్నంత ఫీలింగ్ క‌లిగింద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వున్న ఆమె మూడురోజుల‌నాడే త‌ను ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు స‌మాధానాలు చెప్పింది. వారిలో ఎక్కువ శాతం మ‌హిళ‌లే. వాటిలోని కొన్నింటిని చూద్దాం.
 
మ‌ళ్ళీ షూటింగ్‌ ఎప్పుడు చేస్తున్నారక్కా?
నేను చాలా క‌న్‌ప్యూజ్‌లో వున్నా. కోవిడ్ సెకండ్‌వేవ్ వ‌ల్ల మ‌ర‌లా పాత రోజులు వ‌చ్చేశాయి. గ‌త ఏడాది రిపీట్ అయింది. అందుకే అంద‌రూ జాగ్ర‌త్త‌గా వుండాలి. నేను ఇంటిలోనే సేఫ్‌గా వున్నా. ఇక షూటింగ్ అనేది ఎప్పుడ‌నేది కాల‌మే చెప్పాలి.
 
విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్‌?
ఎవ‌రైనా ద‌ర్శ‌కుడు క‌థ రెడీ చేసుకుంటే చూడండి. నేను న‌టిస్తా. (న‌వ్వుతూ)
 
అక్కా! నీ ఎడ‌మ‌చేతికి ప‌చ్చ‌బొట్టు వుంది. దానికి అర్థం ఏమిటి? ఏమైనా స్పెష‌లా?
ఇది అంద‌రి జీవితాల‌కు స‌రిపోయే కొటేష‌న్‌. ఒక‌రికి ఒక‌రు రీప్లేస్ చేసుకోలేం. నాకు నేనే రీప్లేస్‌. నీకు నువ్వే. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే, మ‌న‌ జీవితంలో ఎవరూ మ‌న‌లా వుండ‌రు. ఇతర వ్యక్తులెవ‌రూ మ‌న‌ల్ని భర్తీ చేయలేరు. ఇది రోజూ చూసుకోవ‌డానికి స్పూర్తిగా వుంటుంద‌ని ప‌చ్చ‌బొట్టు వేసుకున్నా.