రశ్మికకు ప్రపోజ్ చేస్తున్న విజయ్‌దేవరకొండ!
విజయ్ దేవరకొండ, రశ్మిక కాంబినేషన్ `గీత గోవిందం`లో తెలిసిందే. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్` సినిమా కలిసి చేశారు. అది పెద్దగా ఆడలేదు. ఇదిలా వుండగా, ఇటీవలే రశ్మికకు విజయ్ దేవరకొండ ప్రపోజ్ చేశాడు. ఆమెకు చిన్న బహుమతి ఇస్తూ ఈ స్టిల్‌కు ఫోజ్ ఇచ్చాడు. ఇది పూర్తి నిజం కాకపోయినా, కొంత నిజం. ఎలాఅంగే సంతూర్ సబ్బు యాడ్ కోసం విజయ్ చేసిన జిమ్మిక్కు యాడ్ షూట్ ప్రకారం ఇలా కూర్చొని ఆమెకు ఆ గిఫ్ట్ అందించాలి. అయితే విజయ్ మాత్రం నీ కోసం నేను ఇలా ఇస్తున్నా. అలా అని ప్రపోజ్ అయితేకాదు. ఇది కేవలం యాడ్ అంటూ చలోక్తి విసిరాడు. ఇలా సరదాగా యాడ్ కోసం విజయ్ పలికిన పలుకులని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. అసలు విషయానికి వస్తే, ఇప్పటికే బట్టల యాడ్‌లు కొన్ని విజయ్ చేశాడు. ఈసారి సంతూర్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇంతకుముందు మహేస్‌బాబు ఈ సోప్ యాడ్ చేశాడు.
అందుకే విజయ్‌తో కాస్త సరదాగా అందరినీ ఆకట్టుకునేలా స్రిప్ట్‌ను దర్శకుడు రాసుకున్నాడు. సంతూర్ సోప్ కి వీరిద్దరూ బ్రాండ్అంబాసిడర్స్ గా వ్యవహరించబోతున్నారు. ఈ ప్రకటనను ఇటీవల ముంబైలో కోవిడ్ రూల్స్ కి అనుగుణంగా చిత్రీకరించారట. త్వరలో ఇది టీవీల్లో ప్రసారం కానుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'లైగర్' చేస్తున్నాడు.
ఇంతకు ముందు వరుసగా రెండు సినిమాల్లో కలసి నటించగానే వచ్చిన రూమర్స్ తో కొంత కాలం కలసి నటించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ చెప్పాడు. రశ్మిక కూడా తామిద్దరి మధ్య ఉన్నది స్నేహం తప్ప వేరే ఏది కాదని స్పష్టం చేసింది. మరి ఇప్పుడు సంతూర్ వ్యాపార ప్రకటనతో ఇలా విజయ్ సరదాగా చలోక్తులు విసిరాడని తెలుస్తోంది.