బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (16:08 IST)

కొరటాల ఆచార్యలో.. రామ్ చరణ్‌కి జోడిగా గీత గోవిందం హీరోయిన్

మాస్ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాల శివ దిట్ట. ప్రస్తుతం కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల మోషన్ పోస్టరును విడుదల చేశారు. 
 
ఈ సినిమా మెగాస్టార్ టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. 
 
చిరు-చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు . ఇక 'ఆచార్య' షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారభించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 
 
ముందుగా చరణ్ సరసన తమన్నా పేరు ఆతర్వాత కైరా అద్వానీ పేర్లు వినిపించాయి. ఈ క్రమంలో లేటెస్టుగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న 'ఆచార్య' సినిమాలో చరణ్‌కు జోడీగా కనిపించనుందని మరో వార్త చక్కర్లు కొడుతుంది.