గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 7 జులై 2021 (16:18 IST)

ఈ నెల 12 నుంచి రామ్-లింగుసామి సినిమా రెగ్యులర్ షూటింగ్

Lingusami-Ram-kriti etc
ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని షూటింగ్ చేయడానికి రెడీ. బౌండ్ స్క్రిఫ్ట్‌తో దర్శకుడు లింగుసామి రెడీ. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లడానికి నిర్మాత శ్రీనివాసా చిట్టూరి రెడీ. అనువాద సినిమాలతో తమిళ, హిందీ ప్రేక్షకులకు రామ్ చేరువైనా స్ట్రయిట్ తమిళ సినిమా చేయలేదు. అటు దర్శకుడు లింగుసామి తెలుగులో చేయలేదు. అందుకని, ఈ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాను ఎవరూ ఊహించలేదు. కాంబినేషన్ సర్‌ప్రైజ్ ఇస్తే స్టయిలిష్ రోల్స్‌తో పాటు మాస్ క్యారెక్టర్లలో మెప్పించిన రామ్‌ను లింగుసామి ఎలా చూపిస్తారోననే ఆసక్తి అందరిలో నెలకొంది. ఫుల్ నేరేషన్ తర్వాత రామ్ చేసిన ట్వీట్ అంచనాలకు మరింత పెంచింది. ఇదే హుషారులో ఊర మాస్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి టీమ్ రెడీ అవుతోంది. 
 
రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా తెలుగు, తమిళ భాషల్లో ఆయన ఓ ఊర మాస్ సినిమా నిర్మిస్తున్నారు. రామ్ నటిస్తున్న తొలి బైలింగ్వల్ సినిమా ఇది. 'రన్', 'ఆవారా', 'పందెంకోడి' వంటి సూప‌ర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన లింగుసామి చేస్తున్న మొదటి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. రామ్ సరసన 'ఉప్పెన' ఫేమ్ కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించనున్నారు. 'దృశ్యం', 'లూసిఫర్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు అని చేసిన టాప్ సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. 'కె.జి.యఫ్' చిత్రానికి పని చేసిన అన్బు-అరివు ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఇటీవల 'క్రాక్' చిత్రానికి పవర్‌ఫుల్ డైలాగ్స్ రాసిన ప్రముఖ సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
 
నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘చాలా కాలంగా రామ్‌తో సినిమా చేయాల‌ని మంచి స‌బ్జెక్ట్ కోసం చూస్తున్నాం. లింగుసామి చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ ఊర మాస్ స‌బ్జెక్ట్ మా అంద‌రికీ న‌చ్చి రామ్‌గారికి వినిపించాం. క‌థ విన‌గానే ఆయ‌న కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. వెంట‌నే సినిమా చేద్దామ‌న్నారు. రీసెంట్‌గా రామ్‌కు లింగుసామి ఫైనల్ నేరేషన్ ఇచ్చారు. హీరో మరింత ఎగ్జైట్ అయ్యారు. రామ్, లింగుస్వామి, యూనిట్ సూపర్ డూపర్ ఎనర్జీతో షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ నెల 12న హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లవ్ సాంగ్ ట్యూన్ కంపోజ్ చేశారు. మిగతా సాంగ్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్, యాక్షన్ కొరియోగ్రాఫర్లు అన్బు-అరివు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి, సాయిమాధవ్ బుర్రా వంటి టాప్ టెక్నీషియన్లు సినిమాకు పని చేస్తున్నారు. మా బ్యాన‌ర్‌లో భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రెస్టీజియ‌స్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నాం. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు.
 
రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయనణ, యాక్షన్: అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్, స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌, నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుసామి.