సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 జూన్ 2024 (16:09 IST)

మత్స్యకారుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించే రేవు రిలీజ్ కు రెడీ

Harinath Puli, Journalist Prabhu, Dr. Murali Ginjupalli, Rambabu
Harinath Puli, Journalist Prabhu, Dr. Murali Ginjupalli, Rambabu
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు  వ్యవహరిస్తున్నారు..

హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర వివరాలు తెలిపారు.
 
Executive producer Parvataneni Rambabu's birthday cake cutting
Executive producer Parvataneni Rambabu's birthday cake cutting
సినిమా పర్యవేక్షకులు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ,  మిత్రుడు పర్వతనేని రాంబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. నేను గుంటూరులో ఉండగా ఒక వ్యక్తి రేవు సినిమాకు సంబంధించిన కొంత ఫుటేజ్ చూపించాడు. పుటేజ్ ఆసక్తికరంగా అనిపించింది. నేను హైదరాబాద్ వచ్చాక మా మిత్రుడు పర్వతనేని రాంబాబుతో రేవు మూవీ గురించి మాట్లాడాను. రాంబాబు తన మిత్రుడు, ప్రొడ్యూసర్ డాక్టర్ మురళీ గింజుపల్లి గారితో మాట్లాడారు. మా మీద నమ్మకంతో డాక్టర్ మురళీ గింజుపల్లి గారు మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు. ఆయన యూఎస్ నుంచి వచ్చిన తర్వాత రేవు సినిమా ఫస్ట్ కాపీ చూపించాం. డాక్టర్ మురళీ గింజుపల్లి గారు హ్యాపీగా ఫీలయ్యారు. సముద్రతీర ప్రాంతంలో చేపలు పట్టడమే జీవనాధారంగా బతికే మత్స్యకారుల జీవితాల్లోని సంఘర్షణ చూపించే చిత్రమిది. చాలా సహజంగా సినిమా సాగుతుంది, మూవీలో ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టుల నేచురల్ పర్ ఫార్మెన్స్ చేశారు. అజయ్, వంశీ, హేమంత్, ఆంటోనీ తమ క్యారెక్టర్స్ ను అద్బుతంగా పోషించారు. దర్శకుడు హరినాథ్ పులి చిన్న వాడైనా ఎంతో క్లారిటీగా ఆకట్టుకునేలా సినిమాను రూపొందించాడు. ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్ డాక్టర్ మురళీ గింజుపల్లి గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మేమంతా రేవు సినిమా చూసి ఎలాంటి అనుభూతికి లోనయ్యామో...అదే అనుభూతిని రేపు మీరంతా థియేటర్ లో చూస్తూ పొందుతారు. సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. మేము రిలీజ్ డేట్ గురించి అనుకున్నాం. త్వరలోనే ఆ డేట్ అనౌన్స్ చేస్తాం. అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ,  రేవు సినిమాను త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తున్నాం. మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. డాక్టర్ మురళీ గింజుపల్లి 15సం॥ గా నాకు నుంచి మంచి మిత్రులు, మేము చెప్పిన వెంటనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తామంటూ ముందుకొచ్చారు. సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో మేము కలసి మరిన్ని మూవీస్ ప్రొడ్యూస్ చేయాలని, ఆయనతో మా ట్రావెల్ కొనసాగాలని కోరుకుంటున్నాం. నాకు నచ్చి రేవు చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉన్న ప్రభు గారి పర్యవేక్షణలో రేవు సినిమాను విడుదలకు తీసుకురావడం సంతోషంగా ఉంది అన్నారు.
 
నిర్మాత డా॥ మురళీ గింజుపల్లి మాట్లాడుతూ - నేను యూఎస్ లో ఉంటాను. సినిమాలంటే ప్యాషన్. గత పదిహేనేళ్లుగా చిత్ర పరిశ్రమకు దగ్గరగా ఉంటున్నాను. మా సంస్థ ద్వారా మొదట ఒక మంచి సినిమాతో అడుగుపెట్టాలని కోరుకున్నాను. రేవు సినిమా గురించి పర్వతనేని రాంబాబు చెప్పటం ఆయన నిర్ణయానికి ఓకే అనటం మాకు ఆ అవకాశం కల్పించిన ప్రభు గారికి థ్యాంక్స్. రాంబాబు గారు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఆయనతో మా సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ లో మరిన్ని మూవీస్ చేయబోతున్నాం. ప్రభు గారు మా పక్కన ఉంటే ఆ దాసరి గారే మా పక్కన ఉండి నడిపిస్తున్నట్టుగా ఉంది. రేవు సినిమా కాపీ చూశాక నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. మంచి మూవీ. మేము ఇప్పుడు చెబుతున్న మాట సినిమా చూశాక మీరంతా చెబుతారు. మత్స్యకారుల జీవితాల్లోని ఒడిదొడుకులు, వారి జీవన విధానాన్ని ఆకట్టుకునేలా తెరకెక్కించారు దర్శకుడు హరి. రేవు సినిమా గురించి చెప్పగానే నా స్నేహితుడు నవీన్ పారుపల్లి కూడా మూవీలో భాగమవుతానంటూ ముందుకొచ్చారు. త్వరలోనే మంచి డేట్ చూసి మీ ముందుకు రేవు సినిమాను తీసుకొస్తాం అన్నారు.
నటుడు అజయ్ మాట్లాడుతూ - మా రేవు సినిమాకు ప్రభు గారు, పర్వతనేని రాంబాబు గారు, డాక్టర్ మురళీ గారు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా పూర్తయ్యాక దీన్ని ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్న టైమ్ లో పర్వతనేని రాంబాబు గారు, ప్రభు గారు మాకు పరిచయం అయ్యారు. వారు ఎంత సహాయం చేశారో మాకు మాత్రమే తెలుసు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శకుడు హరినాథ్ కి థ్యాంక్స్. రేవు సినిమా మీ అందరికీ నచ్చేలా ఒక మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంటుంది అన్నారు
 
నటుడు హేమంత్ మాట్లాడుతూ - మేము ఇవాళ ఈ స్టేజీ మీద మాట్లాడుతున్నామంటే నటుడిగా ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్ కారణం. మా నాన్న ఉంటే నన్ను ఇలా చూసి సంతోషించేవారు. రేవు మూవీలో విలన్ క్యారెక్టర్ లో మీ ముందుకు రాబోతున్నాను. మా టీమ్ కు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. మా సినిమాను, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రభు గారికి, పర్వతనేని రాంబాబు గారికి, డాక్టర్ మురళీ గింజుపల్లి గారికి థ్యాంక్స్ అన్నారు.
 
నటుడు ఆంటోనీ మాట్లాడుతూ - రేవు సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు హరికి థ్యాంక్స్. ఈ సినిమాలో ఓ మంచి రోల్ లో నటించాను. మట్టి ముద్దలా సెట్ కు వెళ్లిన మమ్మల్ని మంచి బొమ్మల్లాంటి పర్ ఫార్మెన్స్ తీసుకున్నారు దర్శకుడు హరినాథ్. రేవు మూవీ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా అన్నారు.
 
దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ, మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించాను. అన్ని ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. మా రేవు సినిమాను ఎలా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ప్రభు గారు, పర్వతనేని రాంబాబు గారు, ప్రొడ్యూసర్ డా.మురళీ గింజుపల్లి గారు ముందుకు వచ్చి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు అన్నారు.