గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (17:15 IST)

కాంతార నటుడు రిషబ్ శెట్టికి అరుదైన పురస్కారం

Kanthara
కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతారా చిత్రం భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. రూ. 16 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే కాంతారా సినిమాలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టికి ఈ సినిమాతో భారీ క్రేజ్ లభించింది. 
 
మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది.  తాజాగా ఆయనకు ఫోన్ చేసి ప్రధాని మోదీని వ్యక్తిగతంగా అభినందించడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రామిసింగ్ యాక్టర్ కేటగిరీలో నటుడు రిషబ్ శెట్టికి 2023 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించాు. దీంతో రిషబ్ శెట్టికి సోషల్ మీడియా ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.