బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (20:30 IST)

ముదురు బెండకాయలవుతున్నారు, రష్మి-సుధీర్‌ల పైన రోజా పంచ్

ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో రోజా చేసిన వ్యాఖ్యలు ఇపుడు ట్రెండ్ అవుతున్నాయి. ప్రోమోలో రోజా మాట్లాడుతూ... ఏంటి, పెళ్లెప్పుడు చేసుకుంటున్నారంటూ రష్మిని, సుధీర్‌ను డైరెక్టుగా అడిగేశారు. దాంతో యధావిధిగా రష్మి సిగ్గుపడటం, సుధీర్ దానికింకా టైం వుంది మేడమ్ అనడం జరిగింది.
 
రష్మి వైపు చూస్తూ రోజా.. ఏం రష్మి, మరి నువ్ ఏమంటావ్, మేమంతా నీ పెళ్లి కోసం వెయిటింగ్ అని అనగానే మళ్లీ రష్మి సిగ్గులుపోయింది. ఇవన్నీ చూసిన రోజా.. ఇంకా టైముంది అంటారేంటి.. ముదురు బెండకాయలు అయిపోతుంటే అని పంచ్ విసిరారు. ఈ ప్రోమో ఇపుడు ట్రెండ్ అయ్యింది. చూడండి మరి.