మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (13:26 IST)

ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ శబరిని హనుమాన్ తరహాలో ఆదరిస్తారని నమ్ముతున్నా : వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi Sarathkumar, shasank, Varun Sandesh, Producer Mahendranath Kundla
Varalakshmi Sarathkumar, shasank, Varun Sandesh, Producer Mahendranath Kundla
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. శుక్రవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆయన తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. తమిళ ట్రైలర్ నిర్మాత మహేంద్రనాథ్ విడుదల చేశారు.
 
వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ... ''తెలుగులో ఫస్ట్ టైమ్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశా. తన క్యారెక్టర్ చుట్టూ నడిచే సినిమా చేయడం ఏ నటి అయినా సరే ఎగ్జైట్ అవుతుంది. ఇప్పుడు ప్రేక్షకులు మంచి టాక్ వస్తే సినిమాలు చూస్తున్నారు. గుడ్ కంటెంట్ ఉంటే చూస్తున్నారు. 'శబరి' ట్రైలర్ చూడటం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. లీడ్ రోల్ చేశా కనుక కథ నాకు తెలుసు. ట్విస్ట్స్, టర్న్స్ పెట్టి ప్రజెంట్ చేశారు. నాకు ట్రైలర్ నచ్చింది. ఈ సినిమా గురించి చెప్పే ముందు నిర్మాత మహేంద్రనాథ్ గారి గురించి చెప్పాలి. నేను ఈ సినిమాకు సంతకం చేసేటప్పటికి నాకు ఇన్ని విజయాలు లేవు. ఇంత పెద్ద పేరు రాలేదు. సినిమాలు చేస్తున్నాను. నిర్మాతగా తొలి ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా ఫిమేల్ ఓరియెంటెడ్ కథను నమ్మి రాజీ పడకుండా సినిమా చేశారు. బడ్జెట్ ఎక్కువైనా బాక్సాఫీస్ రెవెన్యూ వస్తుందా? మార్కెట్ ఎంత? అని ఆలోచించకుండా సినిమా బాగా రావాలని ఖర్చు చేశారు. వండర్ ఫుల్ స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకు వచ్చిన దర్శకుడు అనిల్ గారికి థాంక్స్. తన బిడ్డను కాపాడడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ. సినిమా బావుంటే చూసే తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. 'హనుమాన్' సినిమాను అంత పెద్ద హిట్ చేసింది తెలుగు ప్రేక్షకులే. ఈ 'శబరి'ని కచ్చితంగా ప్రమోట్ చేస్తారని నమ్మకం ఉంది. ఇది స్ట్రెయిట్ ఫార్వార్డ్ థ్రిల్లర్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో డ్యాన్స్ చేశా. ఈ సినిమా మహేంద్రనాథ్ గారి కోసం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆయనకు విజయాలు వస్తే కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తారు. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుతున్నాను'' అని అన్నారు.  
 
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ,  'మైఖేల్' సినిమాలో నేను, వరలక్ష్మి గారు నటించాం. అయితే, మా కాంబినేషన్ సీన్స్ లేవు. ఆవిడతో కలిసి నటించాలని కోరుకుంటున్నాను. 'శబరి' ట్రైలర్ బావుంది. మే 3న సినిమా విడుదల అవుతోంది. ప్రేక్షకులు అందరూ థియేటర్లలో చూసి సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నాను'' అని అన్నారు.    
 
నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ, నా రెండో సినిమా వరుణ్ తో చేస్తున్నా. మూడో సినిమా అమర్ దీప్ హీరోగా చేస్తున్నాను. ఇక 'శబరి' చూసాక వరలక్ష్మీ శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ గురించి అందరూ చెబుతారు. ఆవిడ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ గురించి చెబుతా. మేం కొడైకెనాల్ షెడ్యూల్ చేశాం. వంద మందితో 15 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశాం. రెండో రోజు వర్షంలో ఒక సీన్ తీయాలని ప్లాన్ చేశాం. ఆ రోజు ఆవిడ రెయిన్ సీన్ చేయనని చెప్పారని కో డైరెక్టర్ వంశీ చెప్పారు. నేను అప్ సెట్ అయ్యాను. అరగంట తర్వాత మళ్లీ వచ్చారు.

'వంద మందితో ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. రెండో రోజు ఈ సీన్ చేయడం వల్ల నేను సిక్ అయితే నిర్మాతకు ఎంత లాస్? ఆయన ఏమైపోతారు? ఆలోచించారా? లాస్ట్ డే ఈ సీన్ పెట్టండి. నేను చేస్తాను' అని మేడం చెప్పారని చెప్పాడు. నిర్మాత గురించి ఆలోచించే ఆరిస్టులు ఉండాలి. నిర్మాత బతికి ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు. సినిమా ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు. మే 3న ఈ సినిమా విడుదల అవుతోంది. నిర్మాతగా నా తొలి సినిమా ఇది. మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఇంకా నటుడు శశాంక్, అమర్ దీప్, ప్రభు మాట్లాడుతూ, ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.