వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో అర్జునుడి గీతోపదేశం ప్రారంభం
Akhil Raj, Divija Prabhakar, Rajeev, Satish Gogada and others
వరలక్ష్మీ శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా, అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్ ఇతర ప్రధాన పాత్రలలో సతీష్ గోగాడ దర్శకత్వంలో ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం#1 గా రూపొందనున్న చిత్రం 'అర్జునుడి గీతోపదేశం'. త్రిలోక్ నాథ్.కె, ప్రదీప్ రెడ్డి.వి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో కూకట్ పల్లిలోని శివాలయంలో ప్రారంభమైయింది.
ముహూర్తపు సన్నివేశానికి కనుమెలి అమ్మిరాజు క్లాప్ కొట్టగా మల్లాల సీతారామరాజు కెమెరా స్విచాన్ చేశారు. త్రిలోక్ నాథ్, పూజిత స్క్రిప్ట్ అందించగా లక్కంశెట్టి వేణు గోపాల్ తొలిషాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు.
రాజీవ్, ఆదిత్య శశికుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా, చైతన్య కందుల డీవోపీగా, అర్జున్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
మూవీ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు సతీష్ గోగాడ మాట్లాడుతూ.. దర్శకునిగా ఇది నా తొలి చిత్రం. ఈ కథ చెప్పినపుడు నటీనటులంతా చాలా పాజిటివ్ గా స్పందించారు. మార్చి 20 నుంచి మొదటి షెడ్యుల్ అమలాపురంలో మొదలుపెడుతున్నాం. తర్వాత వైజాగ్, హైదరాబాద్, చెన్నై లో తర్వాత షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాం.
నిర్మాత మాట్లాడుతూ.. ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ లో ఇది మొదటి సినిమా. సతీష్ చెప్పిన కథ చాలా అద్భుతంగా అనిపించింది. ప్రేక్షకులందరినీ అలరించేలా ఈ సినిమా వుంటుంది'' అన్నారు
రాజీవ్ మాట్లాడుతూ.. దర్శకుడు సతీష్ కి సినిమా అంటే చాలా పాషన్. కథ చెప్పినపుడు చాలా ప్లజెంట్ గా అనిపించింది. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. యంగ్ టీంతో ఈ సినిమా చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలి' అన్నారు.
దివిజ మాట్లాడుతూ.. చాలా మంచి కథ ఇది. ఇందులోలీడ్ రోల్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేస్తున్నాం'' అన్నారు.