శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 19 మే 2017 (11:28 IST)

‘సాహోరే బాహుబలి’ పూర్తి వీడియో యూట్యూబ్‌లో విడుదల. మతిపోగొడుతోన్న విజువల్ వండర్

అద్భుతం, మహాద్భుతం, కమనీయం వంటి భాషలోని పదాలన్నీ వర్ణించినా బాహుబలి2 లోని ఆ పాట భారీతనాన్ని, దృశ అద్భుతాన్ని వర్ణించలేవు. గురువారం బాహుబలి చిత్రబృందం అత్యుత్తమ 4కే క్వాలిటీతో విడుదల చేసిన సాహోరే బాహుబ

అద్భుతం, మహాద్భుతం, కమనీయం వంటి భాషలోని పదాలన్నీ వర్ణించినా బాహుబలి2 లోని ఆ పాట భారీతనాన్ని, దృశ అద్భుతాన్ని వర్ణించలేవు. గురువారం బాహుబలి చిత్రబృందం అత్యుత్తమ 4కే క్వాలిటీతో విడుదల చేసిన సాహోరే బాహుబలి పాట యూట్యూబ్‌లో రికార్డును బద్దలు చేసింది. కన్నులవిందు అనే పదానికి అసలైన నిర్వచనంలా రాజమౌళి తెరకెక్కించిన ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే భారత్‌లోట్విటర్‌ ట్రెండింగ్‌లో మూడోస్థానం సొంతం చేసుకుంది. 
 
కీరవాణి ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. దలేర్‌ మెహెందీ, ఎం.ఎం. కీరవాణి, మౌనిమా ఈ పాటను ఆలపించారు. బాహుబలి2 లోని భారీతనాన్ని మొత్తంగా ఈ పాటలో చూడవచ్చు అన్నంతగా మహాద్భుతంగా మన కళ్లముందు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించేసింది. బాహుబలి-2 సినిమాను చూసేందుకు యావత్ ప్రపంచం ఎందుకు వెర్రెత్తి పోతోందో ఈ ఒరిజనల్ పాటను యూట్యూబ్‌లో చూస్తే చాలు అర్థమైపోతుంది. 
 
బాహుబలి2 సినిమాను థియేటర్లోనే చూడండి.. పైరనీ జోలికి వెళ్లవద్దు సినిమా చూసిన సంతృప్తి కలగదు అని ప్రపంచమంతటా సినిమాను చూసిన ప్రేక్షకులు ముక్తకంఠంలో ఎందుకు చాటి చెబుతున్నారో సాహోరె పాట చూసిన తర్వాతే అర్థమవుతోంది. కళ్లముందు ఒక దృశ్య అద్భుతాన్ని సృష్టిస్తున్న పాటను చూస్తుంటే ఇంకా బాహుబలి-2ని చూడని వారికి ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అనేంత ఉత్కంఠ కలుగుతోంది.
 
 
‘బాహుబలి’కి సీక్వెల్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘బాహుబలి 2’ ప్రపంచ వ్యాప్తంగా చక్కటి విజయం అందుకుంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
 
ఎవరైనా ఇంకా యూట్యూబ్‌లో సాహోరే బాహుబలి డిజిటల్ పాట చూడనట్లయితే వెంటనే కింది లింకును చూసేయండి.
 
Saahore Baahubali Full Video Song - Baahubali 2 Video Songs | Prabhas, Ramya Krishna