శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2023 (08:50 IST)

సోల్ ఆఫ్ స‌త్య‌ గా సాయి ధ‌ర‌మ్ తేజ్

Sai Dharam Tej, Swathi
Sai Dharam Tej, Swathi
సుప్రీమ్ హీరో సాయి  ధ‌ర‌మ్ తేజ్ త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓ స్పెష‌ల్ వీడియోను రూపొందించారు. దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన వీడియో అది.  ఈ స్పెష‌ల్ వీడియో నుంచి ‘స‌త్య‌’ అనే పేరుతో ఓ టీజర్‌ను విడుద‌ల చేశారు.  ఈ స్పెష‌ల్ వీడియోలో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి స్వాతి న‌టించింది. ఈ గ్లింప్స్‌ను మేక‌ర్స్ ‘సోల్ ఆఫ్ స‌త్య’ అని పేర్కొన్నారు. వీడియో కూడా టైటిల్‌కు త‌గ్గట్టే ఉంది. గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే సాయిధ‌ర‌మ్ తేజ్‌, క‌ల‌ర్స్ స్వాతి పెళ్లి చేసుకోవ‌టం ప్రేమ‌తో కౌగిలించుకునే స‌న్నివేశాల‌ను చూడొచ్చు. 
 
ఈ మ్యూజికల్ షార్ట్‌లోని పాట‌ను టాలెంటెడ్ సింగ‌ర్ శృతి రంజ‌ని కంపోజ్ చేసింది. స‌త్య అనే స్పెష‌ల్ వీడియోతో ఆమె మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తుంది. ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ సైనికుడిగా క‌నిపిస్తారు. ఓ సైనికుడు భార్య దేశం కోసం చేసే త్యాగాల‌ను చూపిస్తున్నారు. ఇదే ‘స‌త్య‌’లోని ప్రధానమైన ఎమోష‌న్‌. అది చూసిన‌ప్పుడు భావోద్వేగంతో మ‌న ఛాతి ఉప్పొంగుతుంది. 
 
సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి వంటి తమదైన అద్భుతమైన నటనతో మ్యూజికల్ షార్ట్‌లో భావోద్వేగాల‌ను ప‌లికించారు. మ‌రోసారి వారెంతో మంచి న‌టీన‌టులో ఈ పాట‌తో రుజువైంద‌నే చెప్పాలి. దేశం కోసం పోరాటం చేసే ఎందరో యోధుల‌కు సంబంధించిన సందేశాన్ని తెలియ‌జేయ‌టానికి మేక‌ర్స్ చేసిన ప్ర‌య‌త్నం ఆక‌ట్టుకుంటోంది. 
 
సాయిధ‌ర‌మ్ తేజ్‌తో పాటు ఆయ‌న స్నేహితులు హ‌ర్షిత్ రెడ్డి, న‌వీన్ విజ‌య్ కృష్ణ ఈ మ్యూజిక‌ల్ షార్ట్‌లో భాగ‌స్వామ్యులుగా వ్య‌వ‌హ‌రించారు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ‘బలగం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందించిన నిర్మాత‌లు హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత రెడ్డి దీన్ని రూపొందించారు. న‌వీన్ విజ‌య్ కృష్ణ డైరెక్ట్ చేశారు. బాలాజీ సుబ్ర‌మ‌ణ్యం సినిమాటోగ్ర‌ఫీ అందించారు.