ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (17:39 IST)

"పుష్ప" సాంగ్‌పై సాయిపల్లవి అంత మాట అనేసిందా?

పుష్పలోని సమంత పాటపై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే, సాయి పల్లవి నటించిన "శ్యామ్ సింగరాయ్" మూవీ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా, స్పెషల్ సాంగ్ చేసే అవకాశం సాయి పల్లవికి వస్తే ఏం చేస్తుంది.? అనే క్వశ్చన్ రైజ్ అయ్యింది.
 
అందుకు సాయి పల్లవి.. "నాకు డాన్స్ అంటే ఇష్టం. కానీ, డాన్స్ చేయడం వేరు, స్పెషల్ సాంగ్‌లో డాన్స్ చేయడం వేరు. స్పెషల్ సాంగ్ చేయాలంటే, స్కిన్ షో తప్పనిసరి. స్కిన్ షోలో నేను కంఫర్ట్‌గా ఉండలేను. సో, కాజల్, తమన్నా, సమంత తదితర హీరోయిన్లు మాదిరి నేను స్పెషల్ సాంగ్స్‌లో నటించలేను.." అని కుండ బద్దలు కొట్టేసింది.