బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (11:37 IST)

సాయిరామ్ శంక‌ర్ 'రిసౌండ్' చిత్రం షూటింగ్ పునఃప్రారంభం

హీరో సాయిరామ్ శంక‌ర్ ఒక‌ ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా ఎస్‌.ఎస్‌. ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సాయిరామ్ శంక‌ర్ స‌ర‌స‌న నాయిక‌గా రాశీ సింగ్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి 'రిసౌండ్' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ టైటిల్ విన‌గానే మాసీగా ఉండి, ఆక‌ట్టుకుంటోంది. 
 
ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం పునఃప్రారంభ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కూ 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తాజాగా ప్రారంభ‌మైన షెడ్యూల్‌లో చిత్రంలోని ప్ర‌ధాన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. 'రిసౌండ్' మూవీని సురేష్ రెడ్డి, అయ్య‌ప్ప‌రాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు. సాయిప్ర‌కాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, స్వీకార్ అగ‌స్తి సంగీత బాణీలు స‌మ‌కూరుస్తున్నారు.
 
తారాగ‌ణం: సాయిరామ్ శంక‌ర్‌, రాశీ సింగ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అర‌వింద్ కృష్ణ‌, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, 'అదుర్స్' ర‌ఘు, పింకీ 
 
సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కుడు: ఎస్‌.ఎస్‌. ముర‌ళీకృష్ణ‌, నిర్మాత‌లు: సురేష్ రెడ్డి, అయ్య‌ప్ప‌రాజు, రాజారెడ్డి, మ్యూజిక్‌: స్వీకార్ అగ‌స్తి, 
సినిమాటోగ్ర‌ఫీ:  సాయిప్ర‌కాష్‌, ఎడిటింగ్‌: ఉపేంద్ర‌, ఫైట్స్‌: న‌బా స్టంట్స్‌, పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.