సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (08:37 IST)

"సైరాత్" హీరోయిన్ ఇంటర్ పరీక్షల్లో పాస్

"సైరాత్" హీరోయిన్ రింకూ రాజ్‌గురు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. 2016లో 'సైరాత్' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆమె స్కూలు విద్యార్థినిగా ఉంది. ఆ తర్వాత ఆమె నటించిన 'సైరాత్' చిత్రం విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ద్వారా ఈ అమ్మడుకు పేరు వచ్చింది. 
 
గత మార్చి నెలలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసిన రింకూ... ఈ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. తాజాగా మహారాష్ట్ర హైయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో 82 శాతం మార్కులతో రింకూ ఉత్తీర్ణురాలైంది. కాగా, ఈమె సినిమాల్లో కొనసాగుతూనే తన ఇంటర్మీడియట్‌ను పూర్తిచేసింది.