ప్రభాస్ వర్కింగ్ స్టిల్‌ను విడుదలచేసిన సలార్ టీమ్
Salar working still
ఈ పోస్టర్‌లో ప్రభాస్ సూపర్ గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ స్టైలిష్ మేకోవర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ రేంజ్ మెకోవర్ కి కారణమైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి థాంక్స్ తెలిపుతున్నారు ఫ్యాన్స్. ఈ వర్కింగ్ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. శృతిహాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ KGF సిరీస్‌ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.
