1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 2 ఫిబ్రవరి 2023 (17:09 IST)

సిటాడెల్‌లో సమంత లుక్ అదుర్స్.. బ్రౌన్ లెదర్ జాకెట్.. బ్లాక్ జీన్స్‌లో..

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
అగ్ర హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన ఆశలన్నీ గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం పైనే పెట్టుకుంది. ఇకపోతే.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కుషి" సెట్స్‌లో సమంత త్వరలో జాయిన్ కానుంది. మరోవైపు, స్టార్ హీరోయిన్ తన తదుపరి ప్రాజెక్ట్ సిటాడెల్ షూటింగ్ కోసం ముంబైలో ఉంది.
 
ఇటీవల, సమంత ముంబైకి వెళ్లి, అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రాజ్ అండ్ డికె దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించింది. ఈ హిందీ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన సమంత నటించనుంది. 
 
స్పై థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్ నుండి సమంత ఫస్ట్ లుక్‌ను  ఓటీటీ ప్లాట్‌ఫాం అధికారికంగా విడుదల చేసింది. ఆమె బ్రౌన్ లెదర్ జాకెట్.. బ్లాక్ జీన్స్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే జత గాజులతో ఆమె అందం ఇనుమడించింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
 
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇందుకోసం ఈ సినిమా బృందం ఉత్తర భారతదేశంతో పాటు సెర్భియా, దక్షిణాఫ్రికాలను చుట్టేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలో ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను వెల్లడిస్తుంది.  
Samantha Ruth Prabhu