అంద‌రికీ షాక్ ఇచ్చిన స‌మంత‌... ఇంత‌కీ ఏం చేసింది..?

శ్రీ| Last Modified శుక్రవారం, 19 జులై 2019 (13:32 IST)
స‌మంత తాజా సంచ‌ల‌నం ఓ..బేబి. అలా... మొద‌లైంది ఫేమ్ నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్ అయిన ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ.. సినీ పండితుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇదిలా ఉంటే... స‌మంత అంద‌రికీ షాక్ ఇచ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... స‌మంత యుట‌ర్న్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో న‌టించింది.

ఈ సినిమాకి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి కానీ.. క‌లెక్ష‌న్స్ మాత్రం ఆశించిన స్ధాయిలో రాలేదు. అందుకే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వ‌చ్చినా అస‌లు ఎంత క‌లెక్ట్ చేస్తుంద‌ని స‌మంత‌కి డౌట్‌గా ఉండేద‌ట‌. ఎలాగైనా స‌రే ఈ సినిమాతో స‌క్స‌ెస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప్రీ ప్రొడ‌క్ష‌న్ నుంచి సినిమా స్క్రీన్ పైన వ‌చ్చే వ‌ర‌కు చాలా కేర్ తీసుకుంది. ఆడియ‌న్స్‌ని థియేట‌ర్‌కి ర‌ప్పించ‌డం కోసం వినూత్నంగా ప‌బ్లిసిటీ చేసారు. బేబీ టీమ్ అంతా చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఆఖ‌రికి ఎంతో క‌ష్ట‌ప‌డి, కాదు.. ఇష్టప‌డి చేసిన ప్ర‌య‌త్నానికి మంచి ఫ‌లితం వ‌చ్చింది.

15 రోజుల్లోనే 35 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది అంటే మామూలు విష‌యం కాదు. చైత‌న్య మ‌జిలీ సినిమా ఓవ‌ర్సీస్‌లో క‌లెక్ట్ చేసి క‌లెక్ష‌న్స్‌ను క్రాస్ చేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీతో ఇలా 1 మిలియ‌న్ మార్క్‌కి ద‌గ్గ‌ర‌లో ఉండ‌డంతో అంతా షాక్ అవుతున్నార‌ట‌. మ‌రి.. ఫుల్ ర‌న్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :