ఓంకార్‌కి షాకిచ్చిన కాజల్... అసలు ఏమైంది..?
యాంకర్ టర్నడ్ డైరెక్టర్ ఓంకార్ జీనియస్ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. తొలి ప్రయత్నం సక్సస్ కాకపోయినా రెండో సినిమాగా రాజు గారి గది తీసాడు. ఈ సినిమా విజయాన్ని అందించింది. దీంతో నాగార్జునతో రాజు గారి గది 2 తీసాడు.
ఇది ఆశించిన స్థాయిలో సక్సస్ కాలేదు. అయినప్పటికీ రాజు గారి గది 3 ఎనౌన్స్ చేసాడు ఓంకార్. ఎనౌన్స్‌మెంట్ మాత్రమే కాదండోయ్ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ రోల్ అని ప్రకటించాడు. తమన్నా కూడా ఓపెనింగ్‌కి వచ్చింది.
ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ... తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత కాజల్ వచ్చింది. అంతా ఓకే... ఇక అగ్రిమెంట్ మీద సైన్ చేయబోతుంది అనుకుంటుండగా రెమ్యూనరేషన్ భారీగా చెప్పి ఓంకార్ అన్నయ్యకి షాక్ ఇచ్చిందట.
తమన్నా తప్పుకుంది కాబట్టి వేరే ఆప్షన్ లేక అడిగినంత ఇస్తాడు అనుకున్నట్టు ఉంది కానీ... ఓంకార్ మాత్రం తగ్గలేదట. అంత ఇవ్వలేను అంటూ సైలెంట్ అయిపోయాడట. కాకపోతే కాజల్ ఓకే అయ్యింది అనుకుంటున్న తరుణంలో ఈవిధంగా రెమ్యూనరేషన్ పెంచడంతో ఓంకార్ అన్నయ్య కాస్త షాక్ అయ్యాడట. అదీ సంగతి.