శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 జులై 2017 (11:17 IST)

సంపూర్ణేష్ బాబు ఇలా చేశాడేంటి? బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేశాడా?

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అభిమానులను నిరాశపరిచాడు. బిగ్ బాస్ రియాలిటీ షోలో సినీ నటుడుగా ఉండిన సంపూర్ణేష్.. బిగ్‌బాస్‌ను తిట్టిపోసి బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ షోలో వాతావరణం నచ్చలేదని, తాను ఉండలేక

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అభిమానులను నిరాశపరిచాడు. బిగ్ బాస్ రియాలిటీ షోలో సినీ నటుడుగా ఉండిన సంపూర్ణేష్.. బిగ్‌బాస్‌ను తిట్టిపోసి బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ షోలో వాతావరణం నచ్చలేదని, తాను ఉండలేకపోతున్నానని ఒక్కసారిగా ఆవేశానికి లోనైన సంపూర్ణేష్ బాబు ఆ షో నుంచి బయటికి వచ్చేశాడు. బిగ్ బాష్ షోకు ఓ నమస్కారం అంటూ.. ఈ షోలో తాను వుండలేనని హౌస్ నుంచి వచ్చేశాడు. 
 
పల్లె నుంచి వచ్చిన తాను ఒకే ఇంట్లో నాలుగు గోడల మధ్య జీవించలేకపోతున్నానని సంపూర్ణేష్ తెలిపాడు. అయితే నీ ఇష్టప్రకారమే ఈ షోలోకి వచ్చావని బిగ్ బాస్ సర్థి చెప్పినా, సంపూర్ణేష్ బాబు పట్టించుకోలేదు.  దీంతో సంపూర్ణేష్ బాబును బయటకు వచ్చేయమని బిగ్ బాస్ ఆదేశించారు. అయితే సంపూ బయటకు వచ్చాడా? లేదా అన్నది పూర్తిగా తెలియదు. 
 
ఎందుకంటే హిందీ బిగ్ బాస్ షోలో సీక్రెట్ రూమ్‌లో కొంత మందిని ఉంచి తరువాత మళ్లీ షోకు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంపూ అభిమానులను నిరాశపరుస్తూ బయటకు వచ్చేశాడా? లేక కుటుంబ సభ్యులను కలిసి, మళ్లీ షోలోకి వస్తాడా? అనేది తెలియాల్సి వుంది. 
 
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’  షో ఏడో ఎపిసోడ్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన రెండు రోజుల్లో సంపూర్ణేష్ పూర్తిగా డీలాపడిపోయారు. కాస్త ఒత్తిడికి గురవడంతో ఏకంగా కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంకా ఛాతీలో కాస్త నొప్పిగా ఉందని తోటి సభ్యులకు చెప్పారు. దీంతో పాటు ఇంటికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.