శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (13:24 IST)

సంజు టీజర్ దుమ్ముదులిపేస్తోంది.. దిమ్మతిరిగిపోయిందన్న రాజమౌళి (టీజర్)

బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "సంజు". ఈ చిత్రంలో ఖల్‌నాయక్ పాత్రను రణ్‌బీర్ కపూర్ పోషించాడు. ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదల కాగా, టీజర్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసల

బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "సంజు". ఈ చిత్రంలో ఖల్‌నాయక్ పాత్రను రణ్‌బీర్ కపూర్ పోషించాడు. ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదల కాగా, టీజర్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే, దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసించారు.
 
"కిటికీలోంచి ప్రపంచం మొత్తాన్ని చూశాను... కిటికీయే లేని గదుల్లోనూ ఉన్నాను" అంటూ రణ్‌‌బీర్‌ చెబుతోన్న డైలాగులు ఆకట్టుకున్నాయి. రాజమౌళి దీనిపై ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... 'టీజర్ చూశాక దిమ్మ తిరిగిపోయింది. రణ్‌బీర్‌.. చాలా బాగా నటించావు. రాజ్‌కుమార్‌ హిరాణీ ఓ మాస్టర్' అని పేర్కొన్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
మరోవైపు, ఈ టీజర్‌ను శుక్రవారం వరకు మొత్తం 3,23,31,508 మంది నెటిజన్లు వీక్షించారు. అలాగే, 687 వేల మంది లైక్ చేయగా, 23 వేల మంది డిజ్‌లైక్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో ఉన్న ట్రెండింగ్ వీడియోల్లో రెండో స్థానంలో ఉంది.