గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 18 డిశెంబరు 2019 (15:22 IST)

దేవిశ్రీ స‌రిలేరు నీకెవ్వ‌రు కోసం ఎక్క‌డ? ఎలా వ‌ర్క్ చేస్తున్నాడో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు నుండి విడుదలైన పాటలన్నీ శ్రోతల్ని, అభిమానుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఇటీవలే రొమాంటిక్ మెలోడీగా విడుదలైన మూడో పాట 'హీ ఈజ్ సో క్యూట్' ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. సూపర్ స్టార్ అభిమానులు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలకి ఫిదా అయ్యారు.

ఈ చిత్ర ప్రారంభ సమయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను అలరించేలా సంగీతాన్ని అందిస్తానని చేసిన ప్రామిస్‌ను నిలబెట్టుకుంటూ సరిలేరు నీకెవ్వరు కోసం ఈ మధ్య కాలంలో అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న బెస్ట్ ట్యున్స్‌ను కంపోజ్ చేశారు దేవి శ్రీ ప్రసాద్. 
 
ఇక రాబోయే సోమవారం (డిసెంబర్ 23)న విడుదల కానున్న ఫోర్త్ సింగిల్ గురించి దేవి ఇంటరెస్టింగ్ అప్డెట్ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు మ్యూజికల్ ఫెస్టివల్ మొదలయినప్పటి నుండి ప్రతి సోమవారం ఒక సూపర్ హిట్ సాంగ్‌తో MaSSMB మండేస్, సూపర్ హిట్ మండేస్‌గా మారిపోయి ప్రేక్షకులు, అభిమానులు ప్రతి సోమవారం రాబోయే కొత్త పాట కోసం ఎదురుచూసేలా చేస్తున్నాయి. ఈ పాటలకి సంబంధించి కొన్ని వేల టిక్ టాక్ వీడియోలు ఇంటర్నెట్ అంతా వైరల్ అవుతున్నాయి. 
 
దేవిశ్రీ ప్రసాద్ నాలుగో పాట క్లాస్ సాంగ్‌గా ఉండనుందని రివీల్ చేశారు. ఈ పాట కోసం యూరోప్ లోని అతి పెద్ద ఆర్కెస్ట్రాతో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్‌తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు దేవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన సరిలేరు నీకెవ్వరు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకి, ప్రేక్షకులకి ఫీస్ట్‌గా జనవరి 11, 2020న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది.