సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 11 డిశెంబరు 2019 (22:17 IST)

మ‌హేష్ సెకండ్ సాంగ్‌కి స్పంద‌న ఎలా ఉంది..?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతికి రానున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సాంగ్‌ మైండ్‌ బ్లాక్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా అంద‌రూ ఎదురు చూస్తున్న సెకండ్‌ సాంగ్ సోమవారం సాయంత్రం 5:04 కి విడుదలైంది.
 
’సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో… సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో’ అనే పల్లవి తో సాగే ఈ పాట శ్రోత‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటూ రికార్డ్ వ్యూస్ సాధించి ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో నెం1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన ఫ్రెష్‌ మెలోడి ట్యూన్‌కి రామజోగయ్య శాస్త్రి హృదయానికి హత్తుకునే భావాత్మక సాహిత్యం అందించారు. 
 
ప్రముఖ పంజాబీ సింగర్‌, కంపోజర్ బి. ప్రాక్‌ దీన్ని ఎంతో శ్రావ్యంగా ఆలపించారు. ’సూర్యుడివో చంద్రుడివో’ పాటతో ఆల్‌ మాస్‌, క్లాస్‌ ఆడియన్స్‌, సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌ గా ’సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది అని తెలుస్తోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్‌ ఎంటర్టైనర్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ క్యారక్టరైజేషన్‌, కామెడీ టైమింగ్‌ హైలైట్స్‌గా ఉండనున్నాయి. జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానుంది.