శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Modified: శుక్రవారం, 28 జూన్ 2019 (21:01 IST)

ఆ వైద్యులకు నేను రుణపడి ఉంటా: శర్వానంద్

యువ కథానాయకుడు శర్వానంద్ ఇటీవల షూటింగ్ సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే. తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న వారందరికీ శర్వానంద్ ధన్యవాదాలు తెలిపారు. ‘96’ సినిమా చిత్రీక‌ర‌ణ‌ సమయంలో స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్నప్పుడు శ‌ర్వానంద్ భుజం, కాలికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. సరైన దిశలో ల్యాండ్ అవ్వని కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 
 
భుజం భాగంలోని ఎముక డిస్‌లోకేట్ అయ్యింది. ఆ గాయనికి డాక్టర్‌ గురవారెడ్డి శస్త్ర చికిత్స చేసారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గురవారెడ్డి, డాక్టర్‌ ఆదర్శ్‌లతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసాడు. వారికి ఎప్పుడూ తాను రుణపడి ఉంటానని తెలిపారు. అంతేకాకుండా ‘రణరంగం’ షూటింగ్‌లో తిరిగి పాల్గొనడానికి చాలా ఆత్రుతగా ఉన్నట్లు తెలిపారు.
 
శర్వానంద్ నటిస్తున్న రణరంగం చిత్రాన్ని సుధీర్‌వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా చిత్రం విడుదల తేదీని మాత్రం ఫైనల్ చేయలేదు. ఈ చిత్రం టీజర్‌ను శనివారం సాయంత్రం 4.05గంటలకు రిలీజ్ చేయనున్నట్లు సుధీర్‌వర్మ ప్రకటించారు. ఈ చిత్రంలో కాజల్‌తో పాటు కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తున్నారు.