బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (09:20 IST)

భర్త దూరం... ప్రియుడితో సహజీవనం... న్యూడ్ వీడియోలు తీసి...

తమిళ బుల్లితెరకు చెందిన ఓ నటిని ఓ అసిస్టెంట్ దర్శకుడు మోసం చేయగా, ఈ వ్యవహారంపై ఆమె చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నగ్నవీడియోలు తీసి బెదిరిస్తున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ కారులో తన నగ్న వీడియోలు తీసిన టీవీ సీరియల్ సహాయ దర్శకుడు నవీన్ కుమార్, వాటిని చూపించి, ఖర్చుల కోసం డబ్బు డిమాండ్ చేస్తున్నాడని తమిళ బుల్లితెర నటి జెన్నిఫర్, చెన్నై పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో, కేసును పోలీసులు విచారిస్తున్నారు. జెన్నిఫర్ వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే
 
నగర శివారు ప్రాంతమైన మణలికి చెందిన జెన్నీఫర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. గత ఐదేళ్లుగా టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. ఆమెకు 2019, ఆగస్టు 25న శరవణన్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆపై మనస్పర్థలతో విడిపోయారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది.
 
ఈ క్రమంలో టీవీలకు కావాల్సిన సీరియల్స్‌కు సహాయ దర్శకుడిగా పని చేస్తున్న నవీన్ కుమార్ దగ్గరయ్యాడు. అప్పటినుంచి వీరిద్దరి మధ్యా సహజీవనం కొనసాగింది. లాక్డౌన్ కారణంగా నవీన్ కుమార్‌కు పని పోవడంతో, డబ్బు కోసం జెన్నిఫర్‌ను ఆశ్రయించాడు. 
 
అతని వేధింపులను జెన్నిఫర్ తట్టుకోలేకపోయింది. ఇటీవలి కాలంలో ఆమె షూటింగులో ఉండగా, అక్కడికి వచ్చిన నవీన్, ఆమెను బయటకు తీసుకెళ్లి, కారులో కూర్చోబెట్టి, న్యూడ్ వీడియోలు తీశాడు.
 
ఆపై బెదిరింపులకు దిగడంతో, విషయాన్ని అతని తల్లికి చెప్పింది. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోగా, తన కుమారుడు చెప్పినట్టుగా నడచుకోవాలని బెదిరించింది. దీంతో ఏం చేయాలో తోచని ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరిస్తున్నాడని, దౌర్జన్యం చేస్తున్నాడని, అతనిపైనా, ఆయన తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకోవాలని కోరింది.