శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (19:57 IST)

డెబ్బై ఏళ్లు అయినా ఆహాకు ఎన‌ర్జీ మీరేః అల్లు అర్జున్‌

Allu arjun-Rmarao,vamsi, Aravand
ఈ ఏడాది దీపావళికి ఆ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను రెట్టింపు చేసేలా పండుగ ఆనందాల‌ను పీక్స్‌కు తీసుకెళ్లేలా ఆహా యాప్‌ను 2.0గా అప్‌గ్రేడ్ చేసి స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో వీక్ష‌కుల‌కు అందిస్తూ సంబ‌రాల‌ను తీసుకొచ్చింది ఆహా. అందులో భాగంగా ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’  కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. 
 
ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఆహా ఇంత త్వ‌ర‌గా.. ఇంత‌ స‌క్సెస్ అవుతుంద‌ని అస‌లు అనుకోలేదు. అందుకు కార‌ణం ప్ర‌పంచంలోని తెలుగు ప్రేక్ష‌కులే. అంద‌రికీ మా ధ‌న్య‌వాదాలు. ఒక నెంబ‌ర్ వ‌న్ తెలుగు ఓటీటీగా ఆహా ఉన్నందుకు నాకెంతో గ‌ర్వంగా ఉంది. దీని స‌క్సెస్‌కు కార‌ణమైన వ్య‌క్తులు గురించి మాట్లాడాలంటే ముందు మా నాన్న‌గారు అల్లు అర‌వింద్‌గారి గురించి మాట్లాడాలి. తెలుగు ప్రేక్ష‌కుల కోసం ఓ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ తీసుకు రావాల‌నే ఆలోచ‌న మీదే. డెబ్బై ఏళ్లు వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత కాస్త రిలాక్స్ అవుతూ, రిటైర్ అయ్యే స‌మ‌యంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేక‌ప్ చేసి పాతికేళ్ల లోపు పిల్ల‌ల‌తో హ్యాంగోవ‌ర్‌చేస్తూ వ‌చ్చిన మీరే ఆహాకు ఎన‌ర్జీ. ఏదీ చేసినా పెద్ద‌గా, ఏది చేసిన నెంబ‌ర్ వ‌న్ ఉంటూ దూసుకెళ్లిపోతున్న రామేశ్వ‌ర్ రావుగారు, ఓసారి మ‌మ్మ‌ల్ని క‌లిసి ఇలా ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలోకి రావాల‌నుకుంటున్నామ‌ని అన్నారు. 
 
అప్పుడు ఈ ఓటీటీ ఛానెల్ గురించి చెప్పి డ‌బ్బుతో కూడుకున్న వ్య‌వ‌హారం క‌ష్టంగా ఉంటుంది అని అన‌గానే, ఓసారి ముందడుగు వేస్తే వెన‌క‌డుగు వేసే ప్ర‌సక్తే లేదు అని చెప్పిన రామేశ్వ‌ర్ రావుగారు, చేత‌ల్లోనూ చూపించారు. రామేశ్వ‌ర్ రావుగారి కుటుంబం నుంచి ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్న రామ్ జూప‌ల్లిగారికి ధ‌న్య‌వాదాలు. ఆయ‌న కాంట్రీబ్యూష‌న్ లేక‌పోతే ఆహా ఈ స్థాయిలో నిలిచి ఉండేది కాదు. అలాగే మీ వెంట‌నే నేను అంటూ మా వెన‌క నిల‌బ‌డిన దిల్‌రాజుగారికి స‌భా ముఖంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. వీరంద‌రూ లేక‌పోతే ఈ జ‌ర్నీ పూర్తయ్యేది కాదు. నా క్రియేటివ్ ప‌రంగా వంశీ పైడిప‌ల్లి పిల్ల‌ర్‌గా నిల‌బ‌డి ముందుకు న‌డిపించాడు. మూడేళ్లుగా అజిత్ ఇదే ప‌నిగా దీన్ని ఈ రేంజ్‌కు తీసుకొచ్చారు. అలాగే ఆహా టీమ్ పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఆహాలో వెర్ష‌న్ 2.0 వ‌స్తుంది. ఇది ఎక్స్‌ట్రార్డిన‌రీ ఫ్లాట్‌ఫామ్‌. ఇది ఇంత బాగా రావ‌డానికి అల్లు వెంక‌టేశ్ కార‌ణం. ఈ స‌క్సెస్‌లో కార‌ణ‌మైన ఆహా టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 
 
మేం క‌న్న క‌ల ఈ రోజు నిజ‌మైందిః 
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘2019లో ఆహాను స్టార్ట్‌చేశాం. 2020 ఫిబ్ర‌వ‌రిలో అధికారికంగా స్టార్ట్ చేశాం. అప్పుడు మా మైండ్‌లో ఎన్నో అనుమానాలున్నాయి. అయితే జూప‌ల్లి ఫ్యామిలీ నా వెనుకుండి నా విజ‌న్ స‌పోర్ట్ చేశారు. వారిచ్చిన ధైర్యంతో ముందుకు వ‌చ్చాం. కొంత భ‌యం, ధైర్యంతో ప‌రుగు తీస్తే త్వ‌ర‌లోనే రెండు మిలియ‌న్ సబ్ స్క్రైబ‌ర్స్‌తో మీ ముందుకు రాబోతున్నాం. ఇది సినిమాకో, టీవీకో అల్ట‌ర్‌నేటివ్ కాదు.. ఇంకేదో. తెలుగువారికి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఎంతో ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో ఆ రోజు మేం క‌న్న క‌ల ఈ రోజు నిజ‌మైంది. దీనికి ఏకైక కార‌ణం.. తెలుగు ప్రేక్ష‌కులే. ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటే తెలుగువారికి ఉండే ఇష్ట‌మే మాకు ఈ స‌క్సెస్‌ను తెచ్చి పెట్టింది. గ‌త ఏడాది దీపావ‌ళికి ఎంట‌ర్టైన్మెంట్ ప‌రంగా మేం ప్రేక్ష‌కుల‌కు కొన్ని ప్రామిస్‌ల‌ను చేశాం. వాటిని ఈరోజు నిల‌బెట్టామ‌నే అనుకుంటున్నాం. ఈ దీపావ‌ళికి మీ ముందుకు ఆహా 2.0ను తీసుకొస్తున్నాం. ఇక ముందు మీరు చూసిన కంటెంట్ వేరు. ఇక రాబోయే కంటెంట్ వేరు అని చెబుతున్నాం. పెద్ద క్యాస్టింగ్ ఉన్న సినిమాలు మ‌న ఆహాలో రాబోతున్నాయి. 
 
అల్లు వెంక‌టేశ్‌(బాబీ) మాట్లాడుతూ ‘‘ఈ ఆహా యాప్‌ను త‌యార చేయ‌డానికి కొన్ని ల‌క్ష‌ల మందిని అభిప్రాయాల‌ను తీసుకుని గౌత‌మ్ వింజ‌మూరిగారి స‌హాయంతో ఆహా యాప్‌ను డెవ‌ల‌ప్ చేశాం. ఈ ట్రావెల్‌లో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 
 
ఆహా ప్ర‌మోట‌ర్ రామ్ రావు జూప‌ల్లి మాట్లాడుతూ ‘‘గత సంవత్సరం దీపావళికి ఆహా వేడుక చేసినప్పుడు ఏడాది పొడ‌వునా తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్ అందిస్తామ‌ని ప్రామిస్ చేశాం. దాన్ని ఈరోజు మ‌రో అడుగు ముందుకు తీసుకు వెళుతున్నాం. అందులో భాగంగానే ఆహా 2.0ను స్టార్ట్ చేశాం. ఆహా స‌బ్ స్క్రైబ‌ర్స్ 199 దేశాల్లో ఉన్నారు. ఇంత కొద్ది స‌మ‌యంలో మీ ప్రేమాభిమానాలు సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. తెలుగు ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండ‌స్ట్రీలో ఆహా గేమ్ చేంజ‌ర్ అయ్యింది. మా నాన్న‌గారు, ఈ సంస్థ చైన్మ‌న్ రామేశ్వ‌ర్ రావుగారు మాపై న‌మ్మ‌కంతో మాకు ఎంతో స్వేచ్ఛినిచ్చి ముందుకు న‌డిపించారు. అలాగే ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో నెంబ‌ర్ వ‌న్ తెలుగు ఓటీటీ ఛానెల్‌గా అవ‌త‌రించాం. తెలుగు ప్రేక్ష‌కుల ఇంటికి మ‌ర‌చిపోలేని ఓ పేరుగా ఆహా మారిపోయింది. ఈ జ‌ర్నీలో ఆహా 13 మిలియ‌న్ డౌన్‌లోడ్స్ 46 మిలియ‌న్ యూనిక్ విజిట‌ర్స్‌,  అలాగే 1.6 మిలియ‌న్ యాక్టివ్ స‌బ్‌స్క్రైబ‌ర్స్  ఉన్నారు. ఒకే భాష‌తో ఐదు శాతం మార్కెట్‌ను ఆక్ర‌మించామంటే అది తెలుగు భాష స‌త్తా అని నిరూపించాం. 8 బిలియ‌న్ మినిట్స్ వీక్ష‌కులు వీక్షించారు. నెల‌లో 6 మిలియ‌న్ యాక్టివ్ యూజ‌ర్స్ ఉన్నారు. అలాగే యూజ‌ర్స్ రిటెన్ష‌న్ 75 శాతం ఉంది. గ‌త ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఎగ్జ‌యిట్మెంట్ ఎలిమెంట్స్‌తో మీ ముందుకు రాబోతున్నాం. ఈ స‌క్సెస్‌లో మాకు అండ‌గా నిల‌బ‌డిని తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి, మా టీమ్‌కి థాంక్స్’’ అన్నారు. 
 
వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ ‘‘ఈ జ‌ర్నీలో న‌న్ను భాగం చేసినందుకు ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నాం. గత ఏడాది ఆహాను స్టార్ట్ చేసిన‌ప్పుడు చాలా మందికి చాలా సందేహాలు వ‌చ్చాయి. అయితే రామేశ్వ‌ర్‌రావు, రామ్‌గారు, అర‌వింద్‌గారు ఓ సంక‌ల్పంతో ముందుకెళ్లారు. ఇప్పుడు ఇత‌ర పెద్ద ఓటీటీ సంస్థ‌ల‌తో పోటీ ప‌డుతుంది. దీనికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కులే కార‌ణం. వ‌చ్చే ఏడాది ఇంకా బెస్ట్ ఔట్‌పుట్‌, ఎంట‌ర్టైన్‌మెంట్‌ను అందిస్తాం’’ అన్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆహా సీఈఒ అజిత్ ఠాకూర్ స‌హా ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. తొలిసారి ఆహా అవార్డుల‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా అందించారు.