గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (14:37 IST)

''జబర్దస్త్'' తిట్లు, బూతులు ఇష్టంలేక.. బయటికి వచ్చేశా: షకలక శంకర్

''జబర్దస్త్'' కామెడీ షో గురించి యాక్టర్ షకలక శంకర్ ఎందుకు వద్దనుకున్నారో చెప్పుకొచ్చాడు. తొలుత నుంచి ఓ వైపున సినిమాలు చేస్తూనే.. మరోవైపున జబర్దస్త్ చేసేవాడినని చెప్పాడు. కొంతకాలం 'జబర్దస్త్' చేసిన తరు

''జబర్దస్త్'' కామెడీ షో గురించి యాక్టర్ షకలక శంకర్ ఎందుకు వద్దనుకున్నారో చెప్పుకొచ్చాడు. తొలుత నుంచి ఓ వైపున సినిమాలు చేస్తూనే.. మరోవైపున జబర్దస్త్ చేసేవాడినని చెప్పాడు. కొంతకాలం 'జబర్దస్త్' చేసిన తరువాత తనకు కొత్త కాన్సెప్ట్‌లు దొరకలేదన్నాడు. అలాగని చెప్పేసి తాను ఏదిపడితే అది చేసేరకం కాదని తెలిపాడు. డబ్బులొస్తున్నాయిగదా అని తాను ఎప్పుడూ ఆలోచించలేదని తెలిపాడు. 
 
కాన్సెప్ట్ లేకపోతే సంబంధం లేని విషయాలను గురించి మాట్లాడుకోవలసి వస్తుందని.. తిట్లు, బూతులు చోటుచేసుకోవడం జరుగుతుందని.. అలాంటివి చేయడం ఇష్టలేక.. ఆ విషయాన్ని నాగబాబుగారికి, రోజాగారికి దర్శక నిర్మాతలకి చెప్పి బయటికి వచ్చేశానని తెలిపాడు. 
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఉద్ధానం కిడ్నీ బాధితుల గురించి ప్రపంచానికి తెలియజేశాడని.. ఆ జిల్లా వాసి అయినా ఆ విషయం తనకు తెలియదని.. పవన్ చెప్పాకే తనకు తెలియవచ్చిందని షకలక శంకర్ తెలిపాడు.