శేఖర్ కమ్ముల గోదావరి చిత్రం మొదట గౌతమ్ కు వస్తే వద్దనుకున్నాడు
తెలంగాణ దర్శకుల్లో మొదటగా పేరు తెచ్చుకున్నవాడు శేఖర్ కమ్ముల. హ్యాపీడేస్ తో ఒక్కసారిగా తనవైపు మలుచుకున్న పరిశ్రమను గోదావరి సినిమా చేసేటప్పుడు మొదట హీరోగా బ్రహ్మానందం కొడుకు గౌతమ్ ను అనుకున్నారు. కథంతా విన్నాక నాకు సెట్ కాదని వచ్చేశాడు. ఇదేంట్రా అనిబ్రహ్మానందం అడిగితే. లేడీ ఓరియెంటెడ్ సినిమా అన్నాడట. ఆ ఆఫర్ కూడా తమకు బంధువు కనుక ఆయన ఇచ్చాడంటూ బ్రహ్మానందం తెలిపాడు. తన భార్యకు మేనల్లుడు అవుతాడంటూ వెల్లడించారు. నేను కమ్ముల శేఖర్ అని పిలుస్తాను.
తాజాగా గౌతమ్, బ్రహ్మానందం తాత మనవుడిగా నటిస్తున్నారు. ఆ సినిమానే బ్రహ్మానందం. ఇక గౌతమ్ గతంలో ఆడపా దడపా సినిమాలు చేసినా పెద్దగా పేరు తెచ్చుకోలేదు. వేరే వ్యాపకంలో వుంటూనే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అందుకే దర్శకుడు కథ చెప్పగానే ముందుగా తండ్రి బ్రహ్మానందం గారి పర్మిషన్ తీసుకుని చేశాడు. ఫిబ్రవరి 14న విడుదలకాబోతున్న ఈ సినిమా గౌతమ్ కు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి.