శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (18:17 IST)

శ్రద్ధా శ్రీనాథ్ టాటూ వెనుక ఉన్న రహస్య ఏమిటో తెలుసా?

జెర్సీ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ నటనకు ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఈమె గతంలో తమిళ, కన్నడ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. జెర్సీ చిత్రం హిట్ కావడంతో సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 
 
ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను చూసిన అభిమానులు ఆమె మెడ కింది ఎడమ భాగంపై ఉన్న టాటూని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ టాటూ వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలని తెగ ఆసక్తి చూపారు.
 
తాజాగా శ్రద్ధ తమిళ మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆ టాటూ గురించి శ్రద్ధ మాట్లాడింది. అది ప్రముఖ రాక్ బ్యాండ్ బీటిల్స్ టాటూ అని, ఆ బ్యాండ్ అంటే తనకు చాలా ఇష్టమని, తాను మొదటగా సంపాదించిన డబ్బుతో ఆ టాటూ వేయించుకున్నానని అసలు సంగతి బయటపెట్టింది. ప్రస్తుతం శ్రద్ధ హిందీ హిట్ చిత్రం 'పింక్' తమిళ రీమేక్‌లో నటిస్తోంది.