బుధవారం, 29 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (20:02 IST)

కృష్ణంరాజుగారి విగ్రహంతో సంవత్సరీకం చేసిన శ్యామలాదేవి

krishnaraju family at his house
krishnaraju family at his house
రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుగారి సంవత్సరీకం ఇటీవలే జరిగింది. హైదరాబాద్‌లోని కృష్నంరాజు ఇంటిలో వారి కుటుంబ సభ్యుల నడుమ జరిగింది. లెక్కప్రకారం సెప్టెంబర్‌11,2022న ఆయన పరమపదించారు. అయితే ఈ ఏడాది అధిక మాసం కావడంతో రెండురోజులక్రితమే సంవత్సరీకం జరిగింది. భార్య శ్యామలాదేవి, పిల్లలు సాయి ప్రదీచ, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి, కుటుంబ సభ్యుల సమక్షంలో జూబ్లీహిల్స్‌లోని వారి స్వగృహంలో వేదోక్తంగా జరిగింది. ప్రభాస్ సోదరుడు కార్యక్రమం నిర్వహించారు. 
 
krishnaraju photo- syamaladevi
krishnaraju photo- syamaladevi
విశేషం ఏమంటే, శ్యామలాదేవిగారు తన భర్త కృష్ణంరాజుగారి విగ్రహాన్ని తన ఇంటిలోనే తయారుచేసి వుంచారు. అచ్చు మనిషిలా వుండేట్లు వున్న ఆ విగ్రహానికి కుటుంసభ్యులు, సన్నిహితులు, స్టాప్‌ కలిసి ఆయన ఉన్నట్లే కాళ్ళకు నమస్కరించి తమ అభిప్రాయాన్ని చాటుకున్నారు.

Syamaladevi at krishnamraju statue
Syamaladevi at krishnamraju statue
శ్యామలాదేవిగారు మాట్లాడుతూ, వారికి స్వీట్లు అంటే ప్రియం. అందుకే ఆయనకు తీపి తినిపిస్తున్నానని చెబుతూ, విగ్రహానికి పెడుతూ ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు. ప్రభాస్‌ సోదరుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.