శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (14:49 IST)

ప్రభాస్‌ సలార్‌ ఎందుకు డిసెంబర్‌కు వెళ్ళాడో తెలుసా!

Salar latest US
Salar latest US
రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సలార్‌ గురించే అంతా చర్చ. ముందుగా అనుకున్న డేట్‌ కంటే డిసెంబర్‌ 21 విడుదల డేట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రభాస్‌కు ఇటీవలే కాలికిగాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సివచ్చింది. గతంలో జరిగిన మోకాలి గాయం రానురాను ముదిరిందని తెలిసింది. దాంతో విదేశాలకు వెళ్ళాల్సిరావడంతో సలార్‌ ప్రమోషన్‌లో పాల్గొనడం చాలా కష్టమైంది కాబట్టి అందుకోసం డిసెంబర్‌21ను వేయాల్సివచ్చిందని తెలిసింది.
 
తాజాగా నేడు ఓ చిత్ర యూనిట్‌ లేటెస్ట్‌ పోస్టర్‌ ను విడుదల చేసింది. ఓవర్సీస్‌లో ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా విడుదలకానుంది. 1979కు మించి రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబలే ఫిలింస్‌ నిర్మించింది. శ్రుతిహాసన్‌ నాయికగా నటించింది.