శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (16:02 IST)

సిద్ధార్థ్ శుక్లా మృతి మిస్టరీ కలకలం.. డెత్ వెనుకున్న మిస్టరీ ఏంటి?

బిగ్ బాస్ ఫేమ్, టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా మృతి మిస్టరీ కలకలం రేపుతోంది. ఇంతకీ, సిద్ధార్థ్ శుక్లా డెత్ వెనుకున్న మిస్టరీ ఏంటి? అంటూ అతడి సన్నిహితులు, అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
ముంబై కూపర్ ఆస్పత్రిలో సిద్ధార్థ్ శుక్లా డెడ్ బాడీకి పోస్టుమార్టం జరిగింది. అటాప్సీ రిపోర్ట్ కూడా వచ్చేసింది. అయితే, పోస్టుమార్టం అండ్ అటాప్సీ రిపోర్ట్స్‌లో సిద్ధార్థ్ మృతికి కారణాలేంటో గుర్తించలేకపోయారు. 
 
శరీరం బయటా లోపలా ఎలాంటి గాయాల్లేవని వైద్యులు తేల్చారు. ప్రాథమిక సమాచారం మేరకు కార్డియాక్ అరెస్ట్‌తోనే సిద్ధార్థ్ మరణించినట్లు ప్రకటించారు. దాంతో, అతని మృతికి అసలు కారణమేంటో తేలకుండా పోయింది.
 
మరి, సిద్ధార్థ్ శుక్లా డెత్ మిస్టరీ గుట్టు వీడేదెలా? మరో మార్గం లేదా అంటే… ఉందంటున్నారు వైద్యులు. హిస్టోపథాలజీతో గుట్టు విప్పొచ్చంటున్నారు. ఇంతకీ, హిస్టోపథాలజీ అంటే ఏమిటి? ఇదొక కెమికల్ అనాలసిస్. కీలక ఆర్గాన్స్‌ను కెమికల్ అనాలసిస్ చేస్తే సిద్ధార్థ్ డెత్ మిస్టరీ వీడిపోనుంది.