గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (09:15 IST)

ఫ్యాన్స్‌పై సింగర్ సునీత కామెంట్స్.. ఆమె ట్రెండ్ సెట్టరా?

Sunitha
సింగర్ సునీత ఇంటర్వ్యూ విశేషాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సునీతకు యాంకర్ నుంచి ఓ వింత ప్రశ్న ఎదురయింది. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో పాపులారిటీ ఉంది మీరు ట్రెండ్ సెట్టరా అంటూ ప్రశ్నించింది యాంకర్ . ఈ విషయానికి ఈమె సమాధానం చెబుతూ ఒక్కోసారి నాకు కూడా ఈ విషయంపై ఆశ్చర్యం వేస్తుంది అంటూ సమాధానం చెప్పారు సునీత.  
 
ఈమె తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముందుగా తనకు ఇంతమంది అభిమానులను ఇచ్చినందుకు భగవంతునికి ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
ఈ సందర్భంగా అభిమానుల గురించి మాట్లాడిన సునీత తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని అయితే ప్రతి ఒక్కరూ మేడం మీ పాటంటే చాలా ఇష్టం మీ అభిమానిని అంటూ తనతో ఎన్నోసార్లు చెప్పారని సునీత వెల్లడించారు. అయితే కొన్నిసార్లు వీళ్లకు నేనంటే ఇష్టమా లేక నా పాటలంటే ఇష్టమా?లేదా నేను కట్టుకొని చీరలు అంటే ఇష్టమా అనే సందేహం కలుగుతుంది. 
 
అయితే గత కొద్ది రోజుల క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్న తన వద్దకు ఓ అభిమాని పరిగెడుతూ వచ్చి వెంటనే తన ఫోన్ తీసి అందులో తన ఫోటో చూపించారని, ఆ ఫోటో చూయిస్తూ ఈ చీర మీరు ఎక్కడ కొన్నారు ఇలాంటిదే మా ఆవిడకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ అడిగారని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇలా అభిమానుల గురించి సునీత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.