గురువారం, 13 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 జనవరి 2024 (10:23 IST)

సితారకు నటపై ఆసక్తి వుంది త్వరలో గుడ్ న్యూస్ రాబోతుంది !

Sitara, namrata
Sitara, namrata
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కుమార్తె సితార ఘట్టమనేనికి నటనపై ఆసక్తి వుందని తెలిసిందే. తను చిన్నతనం నుంచి రీల్స్ చేస్తూ బాగా పాపులర్ అయింది. ఇన్ స్ట్రాలో ఆమెకు ఫాలోయింగ్ బాగుంది. ఇంట్లో తండ్రితో కొన్ని స్కిట్స్ వేసి చూపించేది. ముగ్దుడైన మహేష్, సితారకు ఎంకరేజ్ చేసేందకు ముందుకు వచ్చాడు. తాజాగా ఆమె జువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వుంది.
 
అందులో ఆమెను చూసి పలువురు తమ సినిమాలలో తీసుకునేందుకు సంప్రదింపులు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా  నమ్రత పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ఫ్యాన్స్ తో నమ్రత చిట్ చాట్ చేయగా, ఎక్కుమంది సితార గురించి అడిగారు. సితారకు నటనపై ఆసక్తి వుంది అంటూ ముక్తసరిగా చెప్పింది. దీనిని బట్టి త్వరలో ఆమెను పరిచయం చేసే ఆలోచనలో వున్నట్లు కూడా తెలిసింది. ఆ మధ్య సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాటకు డాన్స్ చేసి తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది. 
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం,  మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆమె పాత్ర వుంటుందేమోనని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.