శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Modified: సోమవారం, 1 జూన్ 2020 (22:55 IST)

ఆ సీన్స్ మినహా సినిమా షూటింగ్‌లు చేయవచ్చట..

కరోనా లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా విధించిన లాక్‌డౌన్ 5లో సడలింపులు ఇస్తున్నారు. కేంద్రం పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికే కార్యాలయాలు, షాపులు, మార్కెట్‌లు తెరుచుకున్నాయి. జూన్ 8వ తేదీ నుంచి మత సంబంధమైన దేవాలయాలు కూడా తెరుచుకోనున్నాయి. కాగా సినిమా థియేటర్లను తెరిచే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
 
సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్స్స్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం షూటింగ్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. అనుమతులతో పాటు షరతులను విధించింది. షూటింగ్‌ల సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుండాలి. 
 
నటీనటులు స్వంతంగా మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ స్పాట్‌లలో ఫైట్లు, ముద్దులు, కౌగిలింతలు నిషేధం. ఈ సీన్స్‌కు ఇప్పటిలో అనుమతి లేదు. పెళ్లి సన్నివేశాలు, మార్కెట్‌లో చిత్రీకరణ చేసుకునే సీన్స్‌కు కూడా అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలకు లోబడి షూటింగ్‌లు జరపాలని, అన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.