సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (17:59 IST)

విజ‌య్ దేవర‌కొండ రిలీజ్ చేసిన ‘స్టాండప్‌ రాహుల్‌’లోని సాంగ్‌

varsha-Raj tarun
రాజ్‌తరుణ్‌ స్టాండప్‌ కమేడియన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. సాంటో మోహన్‌ వీరంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్‌ గుడ్‌ రొమాన్స్‌ కామెడీ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్, హైఫైవ్‌ పిక్చర్స్‌ పతాకాలపై నందకుమార్‌ అభినేని, భరత్‌ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజర్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటూ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. రాజ్‌ తరుణ్‌ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది.
 
కాగా, ఈ సినిమా నుండి `అలా ఇలా అనాలని` సాంగ్‌ని క్రేజీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కు ఆల్‌దిబెస్ట్ తెలిపారు. అలా ఇలా అనాల‌ని ఇలా ఎలా ఉందే..అవీ ఇవీ వినాల‌ని ఇవాల‌తోచిందే..అంటూ సాగే ఈ పాట‌కు అనంత శ్రీ‌రామ్ సాహిత్యం అందించ‌గా స్వీకర్‌ అగస్తి స్వ‌ర‌ప‌రిచారు. స‌త్య యామిని, స్వీక‌ర్ అగ‌స్తి సంయుక్తంగా ఆల‌పించారు. ఈ పాట‌కు సోష‌ల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ‘వెన్నెల’ కిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్‌ మరియు మధురిమ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.