జిమ్‌లో సోనూసూద్‌కు కొత్త పార్ట్‌నర్
తన రాబోయే చిత్రం "ఫతే" కోసం సిద్ధమవుతున్న నటుడు సోనూ సూద్ శనివారం వ్యాయామం కోసం జిమ్‌లో కొత్త భాగస్వామిని ఫ్యాన్సుకు పరిచయం చేశాడు. ఈ వీడియోను అతను 'ప్యారే మోహన్' అనే కుక్క పిల్లతో కలిసి ఉన్నట్లు చూపించాడు.
కఠినంగా వర్కౌట్ చేయడానికి అతను తనను ప్రేరేపిస్తున్నాడని సోనూసూద్ చెప్పాడు. అలాగే వీధికుక్కలను దత్తత తీసుకోవాలని ఆయన అభిమానులను కోరారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
వర్క్ ఫ్రంట్‌లో, సూద్ తన రాబోయే యాక్షన్ 'ఫతే' విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ తరహా యాక్షన్‌ను ప్రేక్షకులు చూస్తారని సోనూ సూద్ గతంలో చెప్పారు.