సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు: ఉత్తమ చిత్రం 'మహానటి'
సౌత్ ఫిల్మ్ ఫేర్ 66వ అవార్డుల కార్యక్రమం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా జరిగింది. 2018 సంవత్సరంలో విడుదలైన దక్షిణాది చిత్రాల నుంచి అవార్డు విజేతలను ఎంపిక చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ సినీ ప్రముఖుల సమక్షంలో కన్నుల పండుగగా ఈ వేడుక జరిగింది.
ఈ అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమా వివరాలు..
ఉత్తమ చిత్రం - మహానటి
ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్
ఉత్తమ నటుడు - రామ్ చరణ్ (రంగస్థలం)
ఉత్తమ నటి - కీర్తి సురేష్ (మహానటి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ విభాగం) - దుల్కర్ సల్మాన్ (మహానటి)
ఉత్తమ నటి (క్రిటిక్స్ విభాగం) - రష్మిక మందన్న (గీతా గోవిందం)
ఉత్తమ సహాయ నటి - అససూయ భరద్వాజ్ (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు - జగపతిబాబు (అరవింద సమేత వీరరాఘవ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత - చంద్రబోస్ (ఎంత సక్కగున్నావే - రంగస్థలం)
ఉత్తమ నేపథ్య గాయకుడు - సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే - గీత గోవిందం)
ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయా ఘోషాల్ (మందరా మందరా - భాగమతి)