శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (16:27 IST)

శ్రావణి సూసైడ్ కేస్ అప్డేట్, దేవ్ రాజ్ ప్లేబోయ్‌గా గుర్తింపు

సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసును పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో దేవరాజుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగువస్తున్నాయి. దేవ్ రాజ్ టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతోమంది అమ్మాయిలను తన వెంట తిప్పుకుని, ప్లే బాయ్‌గా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
 
పలువురు అమ్మాయిలతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపినట్టుగా గుర్తించారు పోలీసులు. టిక్ టాక్ వీడియోల ద్వారా ఆ విషయాన్ని నిర్థారించారు. అదే మాదిరిగా శ్రావణిని కూడా ప్రేమ పేరుతో ఉచ్చులోకి దింపాడని, తనతో పాటు మరికొంతమందితో ప్రేమాయణం నడిపినట్టు శ్రావణి గుర్తించి ఆధారాలు దేవారాజ్‌కు చూపించినట్టు తెలుస్తోంది.
 
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇదే సమయంలో శ్రావణికి సంబంధించిన కొన్ని  వీడియో, ఫోటోలను దేవరాజ్ ఆమెకు చూపించడంతో శ్రావణి ఖంగు తింది. ప్రస్తుతం దేవరాజును ఎస్.ఆర్ నగర్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలయజేస్తున్నారు పోలీసులు.