ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (18:05 IST)

మద్యం సేవించి.. పట్టుతప్పి బాత్‌టబ్‌లో పడిన శ్రీదేవి..

అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దుబాయ్‌లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన శ్రీదేవి.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి అయ్యింది. అల్‌ఖుసేనీ పోలీసు

అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దుబాయ్‌లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన శ్రీదేవి.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి అయ్యింది. అల్‌ఖుసేనీ పోలీసు శవాగారంలోనే శ్రీదేవి భౌతికకాయం వుంది. ఈ నేపథ్యంలో యూఏఈ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన చేసింది.

శ్రీదేవి రక్తంలో ఆల్కహాల్ నమూనాలున్నాయని.. మద్యం సేవించిన శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లోని టబ్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. 
 
అయితే శ్రీదేవి గుండెపోటుతో చనిపోయారని వార్తలొచ్చిన నేపథ్యంలో శ్రీదేవి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారని నివేదిక తేల్చింది. ఈ నివేదికను శ్రీదేవి కుటుంబ సభ్యులకు భారత దౌత్య అధికారులు అందించారు. అలాగే శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు.

ఇకపోతే, శ్రీదేవి మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేశారు. శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్‌కు తరలింపు ఏర్పాట్లకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం రాత్రి పది గంటల తర్వాత శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.