ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (18:41 IST)

మహేష్ బాబును నీ బుగ్గలు పిండాలి అంటున్న శ్రీలీల, ఓ మై బేబీ సాంగ్ వచ్చేసింది

Mahesh-sreeleela
Mahesh-sreeleela
మహేష్ బాబు, శ్రీలీల నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా కోసం ఓ మై బేబీ సాంగ్ ను ఇటీవలే షూట్ చేశారు. ఇందులో మహేష్ బాబు అందానికి ముగ్గురాలైన శ్రీలీల అతని వెంట ఎలా పడింది? అనేది కాన్సెప్ట్ తో సాంగ్ వుంది. హరి రామ జోగయ్య రాసిన ఈ పాటలొ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా పేరు కూడా వచ్చేలా ప్లాన్ చేశారు.
 
సాంగ్ ఎలావుందంటే..
ఓ బేబీ.. ఓ మై బేబీ.. నా చెంపలకంటిన సిగ్గువు నువ్వే..ఓ మై బేబీ నీ బుగ్గలు పిండాలి..నీకు ముద్దులు పెట్టాలి. నా చున్నీ నీకు టై కట్టాలి.
ఏ నాటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడే నువ్వేలే..
ఓ మై బేబీ నీ పక్కన వాలాలి. నీ కౌగిలి ఖాళీ పూరించాలి.. హీరోయిన్ వెంట పడే పాటగా వుంది. 
 
ఈ గీతాన్ని గాయని శిల్పారావు ఆలపించగా, శేఖర్ వి.జె. మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తనదైన బాణీలను థమన్ సమకూర్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదలకాబోతుంది.