శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (14:09 IST)

నాగవంశీని ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. ఎందుకంటే?

Mahesh babu smoking look
నిర్మాత నాగవంశీని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడమే ఇందుకు కారణం. 
 
సినిమా విడుదల దగ్గరపడుతున్న తరుణంలో.. ఈ సినిమా నుంచి ఎలాంటి ట్రైలర్, సాంగ్స్ రాకపోవడంపై ప్రిన్స్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇందులో భాగంగా ట్విట్టర్‌లో #DummyProducerNagaVamsi అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 
 
ఈ ట్వీట్ 30 నిమిషాల్లో దాదాపు 20K ట్వీట్లకు పెరిగింది. దీంతో గుంటూరు కారం నుంచి సింగిల్ డిసెంబర్ 11 సోమవారం వస్తుందని సినీ యూనిట్ ప్రకటించింది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత, అభిమానులు #GoodProducerNagaVamsi అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేయడం ప్రారంభించారు.