1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 జూన్ 2023 (15:41 IST)

ఓజి మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ అన్న శ్రీయా రెడ్డి

Shriya Reddy
Shriya Reddy
పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “ఓజి”. భారీ యాక్షన్ ఎంటర్టైనర్. సుజీత్ దర్శకుడు. షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో కొత్తగా నటి శ్రీయ రెడ్డి ఎంటర్ అయింది. దీని గురించి ఆమె ట్విట్టర్లో ఆస్దక్తికరంగా చెప్పింది. నేను ఈ స్క్రిప్ట్‌ని చదివిన క్షణంలో, 5 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో "అవును" అని చెప్పాను! సుజీత్ చాలా అందంగా రాసుకున్న ఈ పాత్రకి ఉన్న పవర్ అదే. 
 
పవన్ కళ్యాణ్ సార్ చార్మింగ్ ఉన్న అద్భుతమైన వ్యక్తి.  ఇక దర్శకుడి బలం ఖచ్చితంగా అతను రాసుకున్న కథలో ఉంది. సుజీత్ అటువంటి రత్నం, ఎప్పటికీ మధురమైనది. అంత మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అందరికి తెలిసిన రవి కె చంద్రన్, OGకి ఒక వరం, ఆశీర్వాదం! ప్రకాష్ రాజ్ తో మళ్లీ పనిచేయడం చాలా ఆనందం.  దానయ్య సార్ నిర్మాతగా అభిరుచి ఉన్నవారు. ఇప్పటివరకు వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. OG కొత్త బెంచ్‌మార్క్‌ క్రియేట్ చేస్తుంది అని పోస్ట్ చేసింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.