ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2024 (14:58 IST)

'మత్తు వదలరా-2' టీజర్‌పై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు

Rajamouli
"మత్తు వదలరా-2" టీజర్‌పై బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రశంసల వర్షం కుర్పించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రాన్ని చూసిన ఆయన తన ఎక్స్ ఖాతాలో అభినందిస్తూ ట్వీట్ చేశారు. అబ్బాయిలు అదరగొట్టారంటూ రాసుకొచ్చారు. టీజర్‌లో విజువల్స్, డైలాగ్స్ సూపర్బ్ ఉన్నాయని మెచ్చుకున్నారు. మంచి కామెడీని అందించాయన్నారు. దీంతో సీక్వెల్‌పై అంచనాలు పెంచేశారని తెలిపారు. సెప్టెంబరు 13వ తేదీన మూవీ టికెట్లను తస్కరించేందుకు (టీజర్‌లోని డైలాగును ఉద్దేశిస్తూ) సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
 
అలాగే టీజర్‌లోని డైలాగును గుర్తుచేస్తూ 'హీ హీ హీ.. హీ టీమ్' అంటూ స్మైలీ ఎమోజీలను ఈ పోస్టుకు జోడించారు జక్కన్న. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, మూవీలో శ్రీసింహా హీరోగా నటించగా, కాలభైరవ సంగీతం అందించారు. వీరిద్దరూ అస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారులు కావడం గమనార్హం. ఇక రితేశ్ రానా డైరెక్ట్ చేసిన 'మత్తు వదలరా'కు సీక్వెల్‌గా 'మత్తు వదలరా-2' వస్తోంది. కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో 2019లో వచ్చిన మత్తు వదలరా మంచి విజయం అందుకుంది. దాంతో సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది.